(8-2-1979)
నా చిన్నప్పుడు.. "నేను బెద్దయ్యాకా.." అంటూ గోప్ప కలలు కన్న గుర్తులు లేవు కానీ...
ఈ పాట మాత్రం తెగ పాడేయడం గుర్తుంది.పాట ఎవరు నేర్పారో సరిగ్గా జ్ఞాపకం లేదు.
మా బడి ప్రిన్సిపాల్ దుర్గాభక్తవత్సలం గారా లేక వారి చెల్లెలు చిత్రా గారా అని.
ఏమైనా అప్పుడు నేర్చుకొన్న ఆ పాట అప్పట్లో మా పాలమూరు కొండల్లో కేరింతలతో గింగిరాలు కొట్టినా ..
నా చిట్టి బుర్రలో దూరి, ఇప్పటి దాకా వదల లేదంటే నమ్మండి!
అందుకే, మా పిల్లలకూ నేర్పేసా...అచ్చంగా డోరిస్ డే గారిదే. ఆ పై మన భానుమతి గారిది కూడాను.
మా చిట్టిగళాలు ఇప్పుడు పొగతోటను హోరిత్తించేస్తున్నాయి !
మీరూ విని తరించండి ..
ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ..అనుకొంటూ.
ఇంతకీ , ఆ బొమ్మలో ఉన్న అమ్మాయికీ ఈ లింకులకు ఉన్న లంకె ను మీరే గ్రహింతురు గాక!
The future is not ours to see ...Doris Day
http://www.youtube.com/watch?v=MXQTWCTc0aI
భానుమతి గారి గళంలో విప్పుకొన్న భవిష్యత్తుగానం
http://www.youtube.com/watch?v=nUSLdY4mL4Q
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
No comments:
Post a Comment