అనుకోకుండా ఒక కథ చదివాను.
ఇప్పటికే ఆ కథ బోలెడంత ప్రాచుర్యాన్ని పొంది ఉన్నది.
ఆ కథకుడిని ఓ.హెన్రీ ...మాంటో.... ఫాల్కనర్ తదితరుల సరసన కూర్చుండబెట్టింది.
ఆ కథనం తెలుగులో జరిగింది కనుక,
మీకూ నాకూ ఆ కథతో ఒక చిన్నపాటి సంబంధం కుదిరింది.
కథ, కథకుడు, కథనం ... దేశకాలసీమితమైనవనీ
...ఆయా పరిమితులను అవగాహన చేసుకొంటూ .. కథావిమర్ష చేయ తగుననీ .. విశ్వసించే వారిలో మన
వల్లంపాటి గారు ఒకరు.
మన బోటి మామూలు పాఠకులం కథావిమర్ష
లాంటి భారీ ప్రయత్నాలను చేయగలవారం కాదు కనుక , ఆ కథను గురించి తోచిన తాజామాటలేవో చెప్పుకొందాం.
ఇంతకీ ఆ కథలో ప్రధాన పాత్రలు
రెండు.
కథకుడు. అతని పాఠకురాలు.
పరోక్ష పాత్రలు మరో రెండు
.. ఆ పాఠకురాలి భర్తా , ఆమె కొడుకు.
ఇది , ఈ నాటి సమాజంలో సాంకేతిక
జ్ఞానాన్ని పరికరాల్ని అడ్డుపెట్టుకొని విజృంభిస్తోన్న విశృంఖల జీవన శైలి పై గురి పెట్టినది.
కథనం చాలా సాఫీ గా సాగింది.
ఒడిదుడుకులు లేవనే చెప్పాలి. అప్పుడప్పుడు , కొన్ని పదాలు కటువుగా తాకినా.. కొన్ని
వాక్యాలు పటుకుమన్నా.
ఆ పాఠకురాలికి మన కథకుడి మీద
అపారమైన గౌరవం. అతని కథలు ఆమె కు "యాంటి డిప్రెసంట్లు" అతనిలో తన తమ్ముడు
కనబడతాడామెకి. తెలుగు కథకులు పుస్తకాలు అచ్చేసుకోలేని అభాగ్యదామోదరులని ఆమెకు కొండంతజాలి. అందుకే, అలా మానసిక స్థైర్యాన్ని
ఇవ్వగలిగిన మంచి పుస్తకాలను అచ్చు వేయమని , ఓ చక్కటి చెక్కు కూడా రాసిస్తుంది.
కథకుడికి సహజంగా ఉన్న సానుభూతితో
పాటు, ఈ చెక్కుబంధం మరింత బాధ్యతగా ఆమె మాటలు వినేట్టు చేస్తుది.
ఆ కథకుడితో బాటు మనమూ వింటాం.అతని
కళ్ళతో ఆమె ఆహార్య అహార వ్యవహారాల గురించి తెలుసుకొంటాం.
ఇక, ఆమె ఒక బాధితురాలు. ఆమె
భర్త విశృంఖల అనైతిక శృంగారజీవితం ,ఆమే కుటుంబ జీవీతంలోని హింస, ఆమె కొడుకు మానసిక
వేదన ..అన్నీ చక్కగా రిపోర్ట్ చేయబడ్డాయి. ఓ.హెన్రీ తరహా చమక్కు ముగింపు కూడా ఇవ్వబడింది.
ఇక్కడ వచ్చిన చిక్కేమిటండీ అంటే,
మనం తెలుగు పాఠకులం అక్కడితో విని ఊరుకొనే
రకాలం కాదు. ఆ కథకుడిలాగా. సరిగ్గా, ఇలాంటి , సంఘంటలకు కథకుడు ఇచ్చే "నిర్ణయాలపై మనకొక అంచనా ఉంటుంది
“.కిం కర్తవ్యం ?” అనుకొంటూ కథకుడు మనకు చూపించే కర్తవ్య మార్గం వైపే మన చూపులన్నీ
కొద్ది మంది కథకులు చెప్పకనే
చెప్పగల నేర్పరులు.మరికొందతు తేటతెల్లంగా చెప్పేస్తారు. కొందరు సూచనప్రాయంగా ఇంకొందరు
స్పూర్తిప్రేరకంగా .. ఏదో ఒక రూపేణా తమ పాత్రల భవితవ్యాన్ని పాఠకులకు స్పురింపజేసేలా
చూస్తారు.
ఇది పొరలుపొరలుగా విచ్చుకొనే
మంచి కథాకథన లక్షణం. ప్రతీ పలుకులోనూ గాఢత ..ఆర్ద్రత..సౌమ్యత లను .. ఒలికించడంలోనే రచయిత బాధ్యత ఏ పాటిదో తెలియవస్తుంది. .
కాగా, ఈ కథకుడి నిర్ణయం చిత్రంగా
ఉన్నది. ఆమె అతనిపై చూపిన అపారమైన నమ్మకం, ఆమె అతనిలో పొందాలనుకొన్న సోదరబాంధవ్యం...ఆ
చిత్రహింస నుంచి ఆమెకు ముక్తిని కలిగించే మార్గాన్ని చూపగలండన్న విశ్వాసం ... ఏమీ చేయ
కుండా నిలబడినప్పుడు... కసాయి వాడి వెంట గొర్రెలా ఈడ్చుకుపోబోతున్నాప్పుడూ.. అతనిని వెనకడుగు వేయించిన ఆలోచనలేవీ?
అదీ ఆ కథలోనే లభ్యం. ఆమె ఉన్నత
కుటుంబానికి చెందిన స్త్రీ. తోచినంత చెక్కు రాసి ఇవ్వగలిగిన స్వతంత్రం ఆమెకు ఉన్నది.నచ్చిన
చోట కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోగల వెసులుబాటు దొరికింది. తాత్కాలికంగా నైనా.
ఆమె రెండు విషయాలనుగ్రహించింది.
ఆమె భర్త నేర ప్రవర్తన. రుజువులు సేకరించింది. రెండవది , తన విముక్తి. మార్గాలను తెలుకున్నది.
అందుకు ,కథకుడికి గల శక్తిని కూడా ఆమె గ్రహించింది. మీడియా ముందుకు రావడానికి , తన భర్తను ఎండకట్టడానికి సంసిద్ధమయ్యింది. ఒక వుద్యమం చేయమంటుంది. చివరకు మళ్ళీ తన కత్తులపంజరానికి తిరిగి తీసుకు పోబడుతుంది.
అందుకు ,కథకుడికి గల శక్తిని కూడా ఆమె గ్రహించింది. మీడియా ముందుకు రావడానికి , తన భర్తను ఎండకట్టడానికి సంసిద్ధమయ్యింది. ఒక వుద్యమం చేయమంటుంది. చివరకు మళ్ళీ తన కత్తులపంజరానికి తిరిగి తీసుకు పోబడుతుంది.
ఇక పోతే, ఆమె సెల్ ఫోన్ నుంచి
అన్ని కదలికలూ , నియత్రించబడినట్లుగా మనకు తేటతెల్లం చేస్తాడు ఆమె భర్త.ఆమె కొడుకు
చిన్నవయస్సులో తండ్రి దురాగతాలకు సాక్షీభూతం.
సరే ,వీటన్నిటి వెనుక ఉన్నది
ఒకటే. మనిషి . మనిషిలోని జంతుప్రవృత్తి.
నిజమే. మనం జంతువులం . నిరంతరం మనకై మనం ఈ "మనిషి " అనే జీవిని సృజియించుకొంటూ ఉంటాం
.
మన సహజ జంతునైజం మనల్ని ప్రేరేపిస్తూనే
ఉంటుంది. ఇది మానవులుగా మనల్ని మనం మలుచుకొనే ప్రక్రియలో అనునిత్యం జరిగే సంఘర్షణ. ఎదురొడ్డి నిలబడగలిగిన వారే కదా మనుషులు. ఆడైనా
.మగైనా. పిల్లలైనా. పెద్దలైనా.
ఇక పోతే, ఈ కథలో అన్ని ఆలోచించగలిగిన
ఆమె, విడాకుల వంటి నాగరీకవీడ్కోలునే కోరుకుంటుంది. అదీ వీలుపడనివ్వరు. ఆమెను ఒక మతిభ్రమణకు
లోనయిన స్త్రీగా చిత్రించే ప్రయత్నం జరుగుతుంది.
హింసలలో కెల్ల ఏ హింస దుర్భరం అంటూ మనం అనుకోలేము.రూపాలు
వేరైన ఎన్నయినా హింస హింసే. హెచ్చొచ్చులు లేవిక్కడ. నిత్యం రగిలే అగ్నిగుండం లాంటి
చిత్రహింస లోనుంచి ఆమె బయట పడాలని ప్రయత్నిస్తోంది.
ఇక, సాధరణ పాఠకులుగా మనం ఎంత
హింస ఎలా జరింది అని తెలుసు కొని ఊరుకోకుండా , ఆ హింస ను ఎలా ఎదుర్కోగలగాలి, ఎలా రూపుమాపాలి,
ఎలా సుహృద్భావ వాతావరణం నెలకొల్పుకోగలగాలి ... ఎలా మరలా ఆ తల్లీ బిడ్డలు ఒక సాధారణ
జీవితం జీవించగలగాలి, ఎలా వారి మానవ గౌరవం నిలబెట్టబడుతుంది.. మొదలగు అనేకానేక అంశాలు
... అత్యవసరంగా ప్రశ్నార్ధకాలై నిలబడతాయి.
ఇక, రెండు ముఖ్య విషయాలు ఆ కథకుడి
నుంచి ఆశిస్తోంది..
ఒకటి ఆ పగటి నేరస్తుడికి పడే
శిక్ష.
రెండొది, ఆ బాధితురాలికి ఆమె
కొడుకుకీ అందవలసిన శారీరిక మానసిక చికిత్స.
మన భాగ్యనగరం లో ఇలాంటి తరహా
వ్యవహారాల్ని చక్కబెట్టడానికి స్వచ్ఛందంగా వకాల్తా పుచ్చుకొన్న వారు సంస్థా గతమైన వారూ
.. అనేకులు. వారెవరి ప్రస్తావనా రాలేదు. వారి కృషీ మన కథకుడికి ఆనలేదు. అందులోనూ ఇది
భాగ్యనగరంలో పుట్టిన కథ.!
ముఖ్యంగా, ఆ కథకుడికి సోషల్
నెట్ వర్క్ లపై కూడా కొంత చిన్నచూపు . సరదాల చోట్లనీ. నిజమే సుమా అనిపిస్తుందే
మో .అయితే , ఆ అవకాశాన్నే మనం ఇలాంటి సంధర్భాల్లో
మనుషుల సహాయార్ధం ఎలా వినియోగించుకొవచ్చునో ఆ మాట మాత్రం ప్రస్తావన లేదు.
కాలక్షేప కూటములే బలమైన సంఘటిత
శక్తులు కాగలవు. అవసరమైనపుడల్లా. ఇది కూడా ముఖ్యం.
అన్నట్లు, ఆ కథారచయత ఇవన్నీ
ఎరగని వారు కారు. ఇంకెన్నో కూడా తెలిసిన వారు. అయితే, అన్ని అంశాలనూ ఒక్క కథలో అమర్చడం
ఎలా అని తాత్సారం చేశారేరేమో.
సరిగ్గా అక్కడే కదా రచయిత చాతుర్యం
,రచనా కౌశలం బయటపడేది ?
ఆయా కథకు తగ్గంత పాళ్ళలో "కిం కర్తవ్యం"అన్న
ప్రశ్న కు సమాధానమూ కోరుకొంటే పాథకులుగా
అది మన తప్పు కాదు కదా?
అలాగే, కథలోని పాఠకురాలి సాంఘిక నేపథ్యానికో ,కులానికో మతానికో
, ప్రాంతానికో పరిమితమైన హింస కాదు కదా ఇది?
ఇది సార్వజనీనమైన సమస్య. ఒక అపురూప మానవ సంబంధాన్ని మూలంగా చేసుకొని,నిత్యం తొలిచివేస్తోన్న
చిత్రహింస.
అయితే, ఈ కథలు నీతి కథలని పరిచయబడ్డాయన్నది
మరొక విషయం.
అలాగని కాకమ్మకథల పసిపాఠకులమూ
కాము. నేతి నేతి నీతి అని వెతుక్కోవడానికి. కథల్లో నీతి నేతిబీరకాయల్లో నేతి వంటిదని మనకు తెలియదూ.
అందుకే, మెరుపు ముగింపో కథనాల్లో
తటాల్మనే వంపో కాదు కదా కథంటే !
కథంటే కథే.
మన కథ ఓ.హెన్రీ దో చెకోవ్ దో మాంటో దో ఫాల్కనర్ దో కానక్కరలేదు. మనదైతే చాలు.... !
అవన్ని వల్లంపాటి గారన్న ఆయా
దేశకాలాలకు చెందినవి . మన కథలు మన దేశకాలాలకు. ఓ.హెన్రీ ,చెకోవ్ తదితరుల తరువాత కథ మరెంత దూరం ప్రయాణం చేసిందో ...!
కథకుడికి పాత్రపట్లా పాఠకుల
పట్లా గౌరవం ఉంటే చాలు!!
అదే మానవ స్పృహను ఊపిరి నింపుతుంది.
అదే మానవ స్పృహను ఊపిరి నింపుతుంది.
మనం తక్షణం ఆలోచించ వలసింది.
కిం
కర్తవ్యం !?!***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
కొంచెం అర్ధమయ్యీ కాకుండా ఉంది
ReplyDeleteసదరు కథను నేను చదివాను.మీరు చదవలేదు కాబట్టి...అనుకుంటా!:-)
ReplyDeleteకథ, రచయిత పేర్లు నా మట్టిబుర్రకి అందలేదు... కథా పరిచయం మాత్రం బాగుంది.
ReplyDeleteఫణీంద్ర
కధ పేరూ రచయిత పేరూ కాస్త వివరంగా చెప్పగలరా. అన్నీ చెప్పి అది మాత్రం సస్పెన్సులో ఉంచారు.
ReplyDeleteదాదాపుగా కథ చెప్పేస్నట్టే ఉన్నాను ! అయినా, పోనిద్దురూ ఎవరి కథనాన వారే పోతారు ! :-)
ReplyDeleteఇంకొంత స్పష్టత ఉండి ఉంటే బావుండేదేమో చంద్రలత గారూ. సాహిత్యంలో మరీ ఇంత మొహమాటం అవసరం లేదు. కథ మీద అభిప్రాయం, రచయిత మీద అభిప్రాయం కానవసరం లేదు. ఒక్కోసారి కథా, రచయితా కలగలిసిపోయి ఉంటారు. పాఠకులకి అది తెలిసిపోతుంది. దాచిపెట్టలేరు. ఏ పాత్ర మీదా రచయితకి అగౌరవం ఉండకూడదనుకుంటాను. మీరు చదివిన, విశ్లేషించిన కథలో స్త్రీ పాత్ర పట్ల రచయితకి ఉన్న తేలికభావం అవమానపరిచేలా ఉంది. రచయిత వ్యక్తిగత జీవితంలోంచే బహుశా ఇటువంటి చులకనభావం కథలోకి ఊడిపడుతుందనుకుంటాను, ఒక్కోసారి రచయితకి తెలియకుండానే కూడా. మీరు తెర తొలగించి కథని ప్రస్తావించి ఉంటే, ఇక్కడ మరింత అర్ధవంతమైన చర్చ జరిగి ఉండేదేమో!
ReplyDeleteబియాండ్ కాఫీ కథ గురించి...
ReplyDelete