Apr 11, 2013

ఉగాది మొదలయినట్టే...నా !

నిన్నో మొన్నో ఓ పత్రికామిత్రులు ఫోన్ చేసి,అదాటున అడిగారు కదా..ఒకటో రెండో అరో కొరో ఉగాది కవితలు  రాసేద్దురూ గబగబ అని!
అలాంటి ప్రమోదకరమగు పనులు ,నేను చేయలేనుస్మీ!

అంచేత, వెన్నెల రాసిన ఈ కవితను మీ కోసం .తన తరుపునా నా తరుపునా!


ఉగాది శుభాకాంక్షలతో !

మరికొన్ని పిల్లల కవితలు ...http://prabhavabooks.blogspot.in/

ఉగాది మొదలయినట్టే...నా !
*
వెన్నెల , 9వ తరగతి, రిషీ వ్యాలీ పాఠశాల 
***
ఉగాది వచ్చింది
కాని, నా ఉగాది ఇంకా మొదలవలేదు
మా నాన్న నాకు చాక్లేట్ ఇస్తే కాని
నా ఉగాది మొదలవదు.

ప్రతి సంవత్సరం జరుపుకునే ఉగాది
అసలు ఒక పండుగే నంటారా?
జీవితంలో కొత్తగా మార్పు వచ్చి,
పాత విషయాలని మరచి,
ఒక చిగురుటాకులా జీవితాన్ని మొదలు పెట్టడమేగా
ఉగాది అంటే !
కాని, జరిగేది ఇదేనా?
ఉగాది అనేది, ఉత్తి పేరు కోసమేనా ?

మీరే చెప్పండి . . .
మనం పాత కక్షలు వదిలామా?
చేసిన తప్పులు సరిదిద్దుకొని,
జీవితాన్ని కొత్తగా ప్రారంభించామా?
జరిగిన విషయాలనే పదేపదే తలుచుకోకుండా ఉన్నామా?
లేదు.
ఇవి ఏమి జరగడం లేదు.

కాబట్టి
వచ్చే ఉగాదిని ప్రత్యేకంగా మొదలు పెడదామా ?

ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామా?

ఇదే మన 'నూతన ఉగాది' అని పిలుద్దామా ?                                 
 ***
ఉగాది కవిత
http://www.prabhavaschool.com/

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

No comments:

Post a Comment