Apr 3, 2013

ఇంతింతై మేమింతై..


నిన్న కాక మొన్న
ఈ ఆలోచన తలపోసినట్టుంది.

ఇందాకెప్పుడో  ఈ మాట
మా గడప దాటినట్టుంది.

మొదటి వాక్యం రాసింది ..
తొలి  చిత్రం గీసిందీ..
ఇప్పుడిప్పుడే కదా అనిపిస్తోంది..

అప్పుడే మా బుజ్జి బడి ఏడాది బిడ్డయింది!

ఒక బిడ్డను పెంచి పెద్ద చేయను
ఊరంతా నడుం బిగించాలట!

ఇందరు బిడ్డల పెంపు ను సొంపును ..
అందరి ఆదరాభినాలతోనేగా ప్రభవింపజేసేది!


మా బుజ్జి బడి కి
మీ అందరికీ సాదర ఆహ్వానం.



All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

1 comment:

  1. చంద్ర గారు,
    మీ "బడి" ని చూసి చాలా సంతోషం వేసింది. మరచిపోయిన మా బాల్యాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చారు. మట్టి బొమ్మలు చేయడం, మీరు చూపించిన పండగలు గతాన్ని తీసుకోని వచ్చి లోగిలిలో నిలబెట్టాయి. మీరు మాతో పంచుకొన్న ఫోటోలలో చూస్తే, మా బాల్యం మీరు ఈ పిల్లల కోసం మలచినంత అద్భుతం గా లేదని అనిపించింది. ఈ పిల్లలు ఎంతో అదృష్టవంతులు . వాళ్ల కోసం మీరున్నారు. వాళ్ళ తల్లి దండ్రులు ఎంతో పుణ్యం చేసుకొన్నారు. ఎంత ధనం ఉన్నా , మీరు అందించే అనుభూతులు అందుకోవటానికి అదృష్టం కావాలి.

    బుడి బుడి నడకలతో అలరిస్తున్న మీ బడి కి, బడి పిల్లలకూ ఇవే మా శుభా శీస్సులు.
    ఇంత చక్కటి బడి కి రూపకల్పన చేసి, ఎన్నో ఆశలను, అనుభవాలను సాకారం చేసు కొన్న మీకు, మీ పిల్లలకూ జే జే లు పలుకుతూ
    భవదీయుడు
    సునీల్ పూబోణి

    ReplyDelete