నేనెంతో బుద్దిమంతురాలిని కదా,
టీవీ లో నాన్ స్టాప్ నాన్చుడు వార్తలు గట్రా చూడను!
చూసినా జడుసుకోను!
అయినప్పటికీ అడపా దడపా వ్రతభంగం తప్పదుకదా!
ఇందాక రెండు వార్తలు ఒక చానెల్ లో.
వెంట వెంటనే.
మొదటిది భక్తుల దీక్షా విరమణ .
రద్దీ. రహదార్లు కిక్కిరిసిపోవడం .వాహనాల రాకపోకల స్థంభన.వగైరా వగైరా.
ఇక రెండోది .
నూతన సంవత్సర వేడుకలు. ఆ వ్యాఖ్యాత్రి గారు పరమౌత్సాహంగా "అంబరాన్ని అంటిన సంబరాల్ని" చెప్పి తరింపచేశారు.
చిత్రంగా ,
రెండింటికి వారు చూపించిన వీడియో క్లిప్పింగ్లు,
ఒకేలా తోచాయెందుకో.
వేరు వేరు ప్రదేశాలు.
వేరు వేరు సంధర్భాలు.
వేరు వేరు కట్టు బొట్టు.
కానీ,
అందరూ ఒకేలా తోచారెందుకో!
గుంపులుగుంపులుగా .
ఒకరిని ఒకరు తోసుకొంటూ.
మూటాముల్లె మోసుకొంటూ.
నాన్నల భుజాలెక్కి ఎగిరిగంతులేస్తున్న చిన్ని బాబులు .
అక్కడా ఇక్కడా.
మరి మీకేమనిపిస్తుంది?
పారవశ్యమా ?
మరేదన్నానా?
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
No comments:
Post a Comment