ఎప్పటిలాగానే ఈ సారీ పిల్లలతో వేసంకాలం కళాకాలక్షేపం చేయాలని ప్రభవలో అందరం అనుకున్నామా,
అనుకున్న వెంటనే హడావుడిగా , ఆ మూల ఈ మూల ఉన్న మిత్రులందరికీ చెప్పి, వారిని మా వూరికి వచ్చేట్టు ఏర్పాటు చేసేసుకున్నాం.
పాట,ఆట, మాట.. నిష్ణాతులు అందరూ వచ్చేయాడానికి అన్ని సౌకర్యాలు అమర్చుతున్నాం ఓ పక్క.
మరో వైపు, వారి నైపుణ్యాన్ని పిల్లలతో వారికి గల అనుబంధాన్ని వివరంగా అచ్చేసి, మా కార్యక్రమ నియమావళి తో సహా.. ఊరంతా కరపత్రాలు పంచేసాం.ఫోనులేత్తి పిలిచేసాం.
బడులకూ కళాశాలకూ కబురు చేర్చాం. అందునా ప్రత్యేకించి, ప్రభుత్వ, గిరిజన,మున్సిపల్ పాఠశాలలకు వార్తను చేరేసాం. వేదికలకూ సంస్థలకూ సమాచారం పంపాం. పత్రికలలో అచ్చేసాం. టివి లలో తెలియపరిచాం.
ఆ నోటా ఈ నోటా వార్త నలుగురికీ చేరేసాం. పత్రికలన్నీ ఈ విషయాన్ని ప్రముఖం గా ప్రచురించాయి
అంతా బాగానే ఉన్నది.
ఇక, పిల్లలు రావడమే తరువాయి.
ఈ లోగా ,మిత్రులన్నారు కదా, "మమ్మల్ని పిలిచారు.వస్తున్నాము. బావుంది.అనేక మార్లు మీరు రచనలో వర్క్ షాపులు నిర్వహించారు.మరి మీరెందుకు నిర్వహించకూడదు " అని.
దాందేముంది అలాగే చేద్దామని, రచన ను నాట్యం,చిత్రలేఖనం,సంగీతం ,నాటకం ల జతన చేర్చాం.
కార్యక్రమ నిర్వహణలో నిమగ్నమై ఉండడం చేత తీరిక లేక కాని, పిల్లలతో గడపడానికి మించినది ఏముంటుంది?
అమ్మానాన్నలు వచ్చారు. వివరాలన్నీ చూశారు.పెదవి విరిచారు.
"అయితే గియితే, ఆంగ్లం లోనే సుమా ! "అన్నారు వారు.
ఉన్న పూర్వానుభవం అంతా తెలుగు రచనలపైనే కదా .పైనుంచి, అంతంత మాత్రం ఆంగ్లపరిజ్ఞానం.
అయితే ఏం, పిల్లల నుంచి నేర్చుకోవచ్చు లెమ్మన్న ధైర్యం ఒక పక్కా,
భాషేదైనా సృజనాత్మక రచనను పరిచయం చేయడం ప్రధానమన్న ఆలోచన మరో పక్కా,
ఎక్కడో ఒక అక్కడ మొదలుపెట్టాలి అన్న భావన ఇంకోపక్క,
ఆఖరికి అమ్మానాన్నల మాటే అమలు పరిచాం.
అలా వచ్చిన పిల్లలతో చేసిన చిన్నప్రయత్నాల రూపాలు.
మీరు చదువుతారనీ.
మీ ఇంటిలోని పిల్లలకు .మీలోని పసి మనసుకు .
కొన్ని చిన్ని రచనలు.
చదువుతూ ఉండండి. తీరిక దొరికినప్పుడల్లా.
కొసమెరుపు ఏమంటే, సంగీతం,నాట్యం, నాటకం ..ఆయా రంగాలలో నిష్ణాతులైన వారి అధ్యయన కార్యక్రమాలను నిర్వహించలేక పోయాం. రచనాప్రయత్నం నిర్విఘ్నంగా సాగింది!
ఇవిగోండి అచ్చుతునకలు!
*
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.