Apr 24, 2010

ఉచితము మరియు నిర్బంధమూ !






రైట్ టు  ఫ్రీ అండ్ కంపల్సరి ఎడ్యుకేషన్  యాక్ట్  , ఈ నెల ఒకటో తేదీన అమలులోకి వచ్చింది. ఈ నేపధ్యంలో , రిషీ వ్యాలీ ప్రిన్సిపాల్ డా.కుమార స్వామి గారు,  డైరెక్టర్ ,టీచర్ ఎడ్యుకేషన్ ,రిషీ వ్యాలీ, శ్రీ  అలోక్ మాథుర్, గారు , ఈ చట్టాన్ని ప్రయివేటు పాఠశాలలూ ఎలా స్వీకరిస్తాయన్న అంశంపై కొన్ని ముఖ్యమైన విషయాలను ఇక్కడ విశ్లేషించారు. చదవగలరు.http://beta.thehindu.com/education/article309771.ece RTE Act: Private schools as catalysts? A. KUMARASWAMY,ALOK MATHUR

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Apr 23, 2010

అబ్బబ్బ ..!

అన్నట్లు,స్పెయిన్లో అబ్బాయిలు  అమ్మాయిలకు గులాబీ ఇస్తే, అమ్మాయిలు పుస్తకం తో బదులిస్తారుట.
ఏకంగా నాలుగు మిలియన్ల పుస్తకాలు గులాబీలమారకం జరిగాయంటే ,చూడండి మరి.
http://pustakam.net/?p=4407

ఆ విశేషాలేమిటో ఇక్కడ చూసి వచ్చారా?
మరి,  అందరికీ శుభాకాంక్షలు.

 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Apr 19, 2010

అమ్మానాన్నలుగా

ఒక్కోసారి అనిపిస్తుంది.
ఎవరు ఎక్కువ ప్రమాదకరం అని?
క్రూరాతిక్రూరమైన నేరాలు ఘోరాలూ ,ఒక్క బొట్టు రక్తం చిందకుండా , ఎంత సునాయాసంగా విచ్చలవిడిగా జరగవచ్చుననీ.

ఒకావిడ ఒకాయన  ఉన్నారు.
వారి చిన్నపిల్లలతో పని చేసుకోలేక , మరో చిన్నపిల్లను పనిలో  కుదుర్చుకున్నారు.
అదేంటని మన లాంటి వాళ్ళం అప్పుడప్పుడు నోరు  చేసుకొంటాం .మరింత సున్నితమైన వాళ్ళమైతే,అయ్యో పాపం అనుకుంటామేమో. కాస్త గట్టి వాళ్ళమైతే , అన్యాయాన్ని తప్పించడానికి గల న్యాయసంబంధ అవకాశాలను అన్వేషిస్తావేమో. బడి లోనో చేరుస్తావేమో.
సరే, అదలా ఉంచుదాం.
ఒకావిడ గారిని పలకరించి చూద్దాం.
"పనిలో కుదుర్చుకున్నాం అన్న మాటే కాని, ఒక్క చోట కుదురుగా పిల్ల ఉండదు. ఫ్రిజ్ లో నీళ్ళు తాగేస్తుంది. పిల్లలకు ఇచ్చిన చాక్లెట్ తినేస్తుంది.టివి చూస్తూ కూర్చుంటుంది.మొన్న కొన్న కొత్త రిబ్బను కనబడడం లేదు. ఇదే తీసుకొని ఉంటుంది. మీకు తెలియదు , మీరలాగే మాట్లాడతారు.మేమెంత బాగా చూసుకుంటున్నామో తెలుసా? మొన్నటికి మొన్నా మిగిలిన పిజ్జా అంతా అమ్మాయికే పెట్టాం. మాట కొస్తే కోక్ కూడా ఇదే తాగేసి ఉంటుంది.నిన్నటికి  నిన్న ,మేం సినిమాకి వెళ్ళోచ్చే సరికి, ఉయ్యాల్లో కూర్చుని ఊగుతుంది. ఎంత ధైర్యం ! "
మరో మాట.
“నీడ పట్టున కూర్చుని కడుపులో చల్ల కదల కుండా పని చేసుకుంటుంది.కోరినంత  తిండి దొరుకుతుంది.
లేకపోతే ,ఎండనబడి మాడుతూ చేల గట్ల మీద కలుపుతీస్తూ బతకాల్సిందేగా?”

సరేనండీ, ఒక క్షణం.
ఇలాంటివి లేదా ఇలాంటివో ..మాటలు తెగ వినబడుతుంటాయ్ ..మన చుట్టూ. కాకపోతే, మన మనసుల్లో నిజంగానే , పేరేంటల్ సెన్సిటివిటీ ఉన్నదా .. ఉంటే అది మన స్వంత పిల్లలకు తప్ప వేరొకరికి పంచలేమా..పంచితే మన  శక్తీ,సమయం వృధా అయిపోతాయా..అయిపోతే మనకేదైనా నష్టం జరుగుతుందా.. అహా...అసలిన్ని ఆలోచించి స్పందించాలా?
అదండీ విషయం,
 సహజంగా మనం జంతువులమే కదా ,ఒక సివంగి లా పిల్లలను కాపాడుకోగలం.
కాగా,ఈ మానవస్పందనలన్నీ ,మనం నేర్చుకున్నవే. అంచేతేనేమో, మాటిమాటికీ , ఎవరో ఒకరు గుర్తు చేయాలి.మరెవరో కన్నెర్ర చేయాలి. ఇంకెవరో కొరడా ఝుళిపించాలి .మాటిమాటికీ గుర్తు చేయాలి, ఇది మానవత్వం కాదు సుమీ అని.
 ఎంచేతంటే, ఒకావిడగారు, వారి ఒకాయన గారు ఒక చిన్నపని చేసారు. అమ్మాయి నాన్న కడచూపులకు బిడ్డను పంపమని ప్రాధేయ పడితే,పంపలేదు. వాళ్ళ కె.జి. పిల్లలకు నెల పరీక్షలటమన బడుల్లో నిత్య పరీక్షలు ఉంటాయి కదా ,అని చొప్పదంటు ప్రశ్నలేయ బోయేరు!
తీరా అమ్మాయి ,ఇంటికి వెళితే ఏముందీపోయిన తండ్రి తిరిగి వస్తాడా? వాళ్ళమ్మ  మళ్ళీ పనిలోకి పంపింది.      అమ్మాయి బుద్దిగా తిరిగి వచ్చింది.ఆపై రావాల్సిన ఫోన్లూ లేవూ ఇక చీటికి మాటికి ఊరికి పంపాల్సిన బాదరబందీలు లేవు! హమ్మయ్య !  ఒకాయనా ఒకావిడా తెరిపిన బడ్డారు!
నిజమే, మనలో ఎంతమందిమి మనుషులం ? ఎంతమందిమి అమ్మగా నాన్నగా ఎదగగలుగుతున్నాం ? మనలోని మానవప్రవృత్తిని నిలుపుకోగలుగుతున్నాం ?
ష్ !
All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.

Apr 16, 2010

పరీక్షలండీ బాబూ ..పరీక్షలు !

ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి.
సాహిత్యంలో పరీక్షంటే ,
భలే ఉంటుంది.

ఏదో ప్రశ్నలూ జవాబులూ రాస్తున్నట్లుగా తోచదు.వీటిని దిద్ది మార్కులు వేస్తారనీ అనిపించదు.
ఎవరికో ఏకబిగిన ఉపన్యాసం దంచేస్తున్నట్లు, ఎవరితోనో వాదోపవాదాలకు దిగినట్లు,  తీరికగా తోచిన ఓ కథనో నవలనో నెమరు వేసుకున్నట్లు..అనిపిస్తుంది.
మొదలు పెట్టామా ,మళ్ళీ  ఇన్విజిలేటర్ వచ్చి..దారం ముడేయ్యండి ..అని హెచ్చరించే వరకు, హాయిగా .. ఓ అక్షరవిహారం చేసేసి రావచ్చు.

ఫలానా ప్రముఖ రచయిత ఎత్తిన కలం దించ కుండా దంచేస్తాడు అని అంటూ ఉంటారే , అదేమో కానీ, ఓ మోస్తారుగా అచ్చం అలాగే, ఎత్తిన కలం దించకుండా, వొంచిన తల ఎత్తకుండా ..ఇచ్చిన కాగితాలు నలుపు చేసి...దారం ముడేసి.. నిలువుగా మడతేసి..అయ్యవారికి అప్పజెప్పేసి..గాలిలో తేలుతూ ..పరీక్ష గదిలోంచి బయటకు కులాసాగా రావచ్చు.కాదు మరీ.
ఈ సౌకర్యం .. మాబోటి సాహిత్యవిద్యార్థులకే సుమండీ..అంటే మీకు అసూయ కలుగుతుందేమో.
అప్పుడప్పుడు.. రచయిత జీవిత చరిత్ర గట్రాలు , తారీఖులు దస్తావేజులు ..లాంటి బూజుదులిపే కార్యక్రమం ,
ఫలానా పెద్ద మనిషి అలా అన్నాడు అని అక్షరం పొల్లు పోకుండా రాయగలగడం ..లాంటి కష్టాలు మాకూ ఉంటాయ్. మేం చెప్పుకోను నామోషి పడతాం కానీ!
తప్పించి మిగిలినదంతా... మన సొంత కథ రాసుకున్నంత సుఖం గా రాసుకోవచ్చంటే నమ్మండి.

ఏ పత్రిక్కో ,  ఓహో ..  బ్రహ్మాండం! ఆహా... పరమచెత్త! అంటూ ఎడతెగని ఉత్తరాలు రాసే వారిలా రాసేసి, ఊపిరి పీల్చుకోవచ్చు కూడాను. మనలను ఎవరాపుతారు గనుక!
పాపం దిద్దేవారు.ప్చ్!

దాదాపు పద్దెనిమిదేళ్ళవుతుంది.
నా ఆఖరు పరీక్ష రాసి.
రాయడం వరకూ మన ధర్మం.ఆ పై , దిద్దేవారి ఖర్మం ..సారీ,దయాధర్మం ..
ఏ మూలో .నా పరీక్షాపత్రం దిద్దే వారి కాస్త కష్టాలకు దిగులు పడుతూ..అనుకున్నామో అప్పుడు ..నాకు సరిగ్గా గుర్తు లేదు.వారు మంచి వారు కనుక , నా అక్షరాలను శ్రద్దగా చదివి , బోలెడన్ని మార్కులు ఇచ్చారు. నేను బుద్ధిగా బీరువాలో దాచి పెట్టుకున్నా.

అవన్నీ , అప్పటి సంగతులు.
ఈ నడుమ ,మళ్ళీ పరీక్ష రాయాల్సి వచ్చింది.
అదీ ,సాహిత్యం లోనే.
*
ఆ విశేషాలు మళ్ళీ చెపుతా.అంత వరకు విరామం.
*
ఉండనా మరి?

All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.

Apr 14, 2010

కట కటా!

కట కటా!
తస్మాత్ జాగ్రత్త !

ప్రజాస్వామిక స్పందన...
పౌరుల అభిప్రాయం ..
సర్వజన వాక్కు..
అంటే ...?

ఇకపై ,
చారిత్రక అవశేషాలేనా?
మరింత వివరంగా ఇక్కడ చదవండి.

http://beta.thehindu.com/news/national/article108821.ece
http://www.greenpeace.org/india/press/releases/the-biotechnology-regulatory-a
http://www.downtoearth.org.in/full6.asp?foldername=20100315&filename=news&sec_id=4&sid=3
http://epaper.andhrajyothy.com/AJ/AJyothI/2010/04/15/index.shtml

All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.

Apr 8, 2010

అక్కడ పూసిన పువ్వు

అక్కడ పూసిన పువ్వును
ఇంగ్లీషులో ఇక్కడ చదవచ్చు.
http://www.iupindia.org/Commonwealth_Literature.asp

www.iupindia.org
The icfai University Journal of Commonwealth Literature, Vol.II no.1,2010

అనువాదం : డా.CLL జయప్రద గారు


All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.