మా పిల్లల్లో
సృజనాత్మకత పొంగి పొర్లు తోందంటే నమ్మండి !
మొన్నటికి మొన్న,
ఇద్దరి పిల్లల పుట్టిన రోజులూ ఒక్క రొజే
వచ్చాయి.రాక రాక.
ఇక, పిల్లలంతా చేరి , రెండు రెండు బొమ్మలు గీసేసి.చక చక రంగులు
నింపుతున్నారు. చెరొకటి ఇవ్వడానికి.
గదిలో ఓ పక్కగా , నేల మీద
తన మానాన తాను చక చక వెళుతోన్న గండుచీమను
చూసింది మన శరణి .
"ఆక్కా !
నేను ఆ చీమ బొమ్మే వేస్తా !"
వెలుగుతోన్న ముఖంతో చెప్పింది. ఆ గండు చీమ వంకే చూస్తూ.
"బొమ్మ సరే, రంగులేం వేస్తావ్?"
‘ ఎన్ని రంగులేస్తే
అంత సంతోషం కదా పిల్లలకి నలుపు కన్నా’, అని ఆరా తీసింది అక్క.
"నల్ల రంగు."
"
నల్లగా ఉంటుంది
పరవాలేదా? రంగులేం
ఉండవ్!" అక్క హెచ్చరించింది.
"సరే!"
అప్పటికే పిల్లలు సీతాకోకచిలుకల నుంచి పూల తోటల దాక అనేక బొమ్మలు
గీసేసారు. శరణి కూడా నీలం రంగు ,ఎర్ర రంగు తూనీగల బొమ్మలు గీసింది.
కాసేపు ఆ గండు
చీమతో పాటు నేల మీద పాకి , ఓ చిరిగిన కాగతం
ముక్కమీదకు దానిని ఎక్కించుకొని , తిరిగివచ్చింది
శరణి.
" చీమని అలా పట్టుకోవచ్చా?" అక్క అడిగింది.
" చీమ బొమ్మ
రాదు కదా అక్కా ?" నింపాదిగా
చెప్పింది.
అక్క చీమ ఉన్న
కాగితం ముక్కని జాగ్రత్తగా నేల మీద పెట్టింది.
చక చక వెళుతోన్న చీమను చూస్తూ ,
శరణి గబ గబ
ఓ పెద్ద బొమ్మ గీసింది.
"చీమ చిన్నదిగా ఉంటుంది. ఇంత పెద్ద చీమ బొమ్మేసావే ? " అక్క అడిగింది.
“లడ్డూ పెద్దగా
ఉంటది కదా?” శరణి ఎదురు ప్రశ్న వేసింది.
“లడ్డూనా ?”
" ఈ బొమ్మ ఇస్తే ,
ఆదిత్య , తస్నీం లడ్డూలు ఇస్తారు కదా?"
"అవును"
"చీమకు లడ్డూ ఇష్టం
కదా? "
"అయితే?"
"నేను పేద్ద
చీమయిపోతా.., పేద్ద లడ్డూ
తినేస్తా!" ముక్తాయించింది శరణి, "చాలా లడ్డూలు తినేస్తా!"
అదండీ విషయం !
All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.