Apr 19, 2014

మాటల మాయావికి జేజే !

అవునా? 
నిజమా? 
నిజమేనా?














మాటల మాంత్రికుడు మనలోంచి మాయమైపోయాడా?
ఇక,అక్షరాల్లోంచి పసుపు పచ్చని పిట్టలు...
సీతాకోక చిలుకల గుంపులు.. ఉవ్వెత్తున ఎగిసిపడవా?
***
అవున్లే,
పండువెన్నెల పదాలతో గజిబిజి గందరగోళాల
 చిక్కుముళ్ళు వేసేసి,దారితప్పిన పాఠకుల్ని చూసి చిద్విలాసపు  చిరునవ్వులు చిందిస్తూ ,
అదృశ్యమై పోయానని మురిసి పోతున్నావేం?
ఒకటా రెండా.. యాభై ఏళ్ళు మా చేత ముప్పతిప్పలు పెట్టించావేం?
నీ రహస్యాలు మాకు తెలిసిపోయాయిలే !

నీవు మా ముందుంచి పోయిన
కథల్లోంచి చరిత్రనీ,
చరిత్ర లోంచి జీవితాన్ని,
జీవితంలోంచి మానవ ఔన్నత్యాన్ని ...
మేం గ్రహించలేక పోయామనుకున్నావా?

ఇలా చెప్ప పెట్టకుండా తిరిగి రాని చోటికి వంటరిగా పయనమై పోయావ్?
మా అభిమానం,గౌరవం నిన్ను చుట్టుముట్టేసి ఉంటుందని మరిచిపోయావా?
నీవెప్పుడు వంటరి వాడివి?

తెలుసుకోండి చూద్దామని , మమ్మల్ని పదాలప్రహేళికల వెనుక పరుగులు పెట్టించావా?
నీ మాటల గుట్టులన్నీ తెలుసుకోలేం  అనుకున్నావా?
చిక్కుముళ్ల ఇంద్రజాలాలను ఛేదించలేమనుకొన్నావా?
శుభ్రంగా ఉతికి ఆరేసిన దుప్పట్లతో బాటు , గాల్లోకి తేలే తంత్రం   ...
మాకు తెలియదనుకొన్నావా?

  తీగెపై ఆరేసిన అక్షరాల్లో...
  రహస్యాలన్నీ మూటకట్టేసి మాకిచ్చేసావ్ కదా?  
 ఆ రహస్యాలన్నిటిలోనూ నీవు దోబూచులాడుతూ గుస గుస లాడట్లేదూ...
గుంభనంగా నవ్వుతూ?
మా గుండెల్లో తిష్టవేయలేదూ?
***
అవునా?
నిజమా?
నిజమేనా?
మాటల మాంత్రికుడు మనలోంచి మాయమైపోగలడా ?
***
మాటల మాయావికి జేజే ! 
మనసున్న మేధావికి జేజే! 
మార్క్వెజ్ కు బోలెడంత అభిమానంతో ..
వీడ్కోలు.
***
Some thing VERY personal !
" One Hundred years of Solitude "( English translation)
is as old as me !  
no.. no.. As Young as me ! 
***
గబ్రియెల్ గర్సియా మార్కిస్ ...(మార్క్వెజ్  అంటాం మనం :-)>
(http://en.wikipedia.org/wiki/File:Es-Gabriel_Garcia_Marquez.ogg)
 All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Apr 16, 2014

ఏందంటా ఈ కథా?

అబ్బాయా... అమ్మాయా...
ఏందంటా ఈ కథా?
ఓ ..అంటా..
ఆ మాదిరి ఇరగబడి పోతాండారు..
రొవంత మందల జెప్పేసి పోరాదో..?
http://prabhavabooks.blogspot.in/2014/04/blog-post_16.html

***



All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Apr 14, 2014

కారం దోసెలు...కమ్మటి కబుర్లు !

కారం దోసెలు    ...         
కమ్మటి కబుర్లు ...
కథా విశ్లేషణలూ ... 
వెరసి . . . కథ 2013 ఆవిష్కరణ.
P.Satyavati garu

Sri Ramana garu








Sivareddy garu, Uma Maheshwara Rao garu.

 ***
ఎంతగా మబ్బులు ఆకాశంలో దోబూచులాడి ఊరించినా , 
తెల్లారేపాటికి ఎటో మాయమయ్యాయి.  ఏదో పనున్నట్టుగా,  గుంపు  కట్టుకొని మరీ !
ఎప్పటిలాగానే తన అలవాటు తప్పకుండా , 
“ సింహపురి “ అతిథులను ఓ గంటన్నర ఆలస్యంగా తెచ్చి దింపింది.
ఎందుచేతనో , కార్యక్రమ నిర్వాహకుల ఫోను ఎంతకీ పలకలేదు. సరే లెమ్మని, పడుతూ లేస్తూ కల్యాణ మండపం చేరుకొనే సరికి, 
పగలు పదిగంటలు. చిమ్మచీకటి. 
కరెంటుకోతలు..ధారాపాతంగా చెమటలు.
కాస్తంత వెలుగు,గాలి ఆడే చోట,  తిరుపతి ,ఒంగోలు సాహితీ మిత్రులు .
వేదిక మీద ఇంకా , కుర్చీలయినా సర్దనేలేదు. వెలుగొచ్చాక చూద్దాంలెమ్మనుకొన్నారో ఏమో.
కాస్త , హడావుడి పడగానే, 
అటు వేదిక , ఇటు తేనీరు తయారు!
దీపాలు వెలగడం.. కోమల విలాస్ లో టిఫిన్లు ముగించుకొని ,
అతిథులు రావడం అటూ ఇటుగా ఒకమారే.
ఇంతలోనే, పోలిసుల కవాతు. అదేమిటి చెప్మా అనుకొనే లోపలే, వారి వెనుకగా, చిరునవ్వుతో సరికొత్త కథకులు సునీల్ కుమార్ గారు సభాప్రవేశం.
ఇక, అన్నీ సిద్ధం.  అందరు సర్దుకొని, కార్యక్రమం ప్రారంభం.
ఈతకోట సుబ్బారావు గారి స్వాగతోపన్యాసం . వాసిరెడ్డి నవీన్ గారి కథాసాహితి పరిచయం. 
కుడిఎడమల , శ్రీరమణ గారు శివారెడ్డిగారు .. ధగధగా మెరియగా, మైకు నా చేత బడింది!
మధ్యే మధ్యే శివారెడ్డి గారు "అధ్యక్షులు ఎలా ఉండవలెనన్న" పాఠాలతో , 
నా చెవి మెలి వేస్తుండగా.... కార్యక్రమ నిర్వహణ.
 Front / L to R prameela rani garu, VPratima, Vishnu. chandra latha,
Second /R to L/Sndhu amdhuri ,Subhadra Kumari, Paturi annapoorna, sasi kala
శ్రీ రమణ గారు ముఖ్య అతిథి ప్రసంగము, శివారెడ్డి గారు, డా.వి.చంద్ర శేఖర్ రావు గారు ప్రధాన వక్తలుగా,  నవీన్ వాసిరెడ్డి గారు, పాపినేని శివశంకర్ గార్లు కథాసాహితి ప్రయాణాల్లో ఒడిదొడుకులను పంచుకోగా, పెనుకొండ లక్ష్మీనారాయణ గారు , మరి కొన్ని సంగతులను ముచ్చటించారు.
కార్యక్రమం హాయిగా సాగింది.
పుస్తకావిష్కరణ తరువాత , రచయితలు పుస్తకాలు అందుకొన్నారు.
Lto R, Naveen,Madhurantkam Narendra ,Siva Reddy ,Dr.Chandra Shekhar Rao,C.A.Prasad garlu
ఇక, ఆ ప్రధాన వేదిక మీది ప్రసంగాల సారాంశాన్ని మూడు ముక్కల్లో చెప్పాలంటే,
Lto R Papineni Sivashakar, Anil Atluri,Vishnupriya,
Katragadda Dayanand
emergence  (పుట్టుక),  evolution (పరిణామం),  epiphany (పరిణితి).
 కథ పుట్టుక లోని సహజత్వాన్ని గురించి శ్రీ రమణ గారు, దాని పరిణామం లోని ఆలోచన గురించి శివారెడ్డి గారు, పరిణితికి దోవ తీసే అన్వేషణాదృష్టినీ, సృజనాత్మక నైపుణ్యాన్ని గురించి 
డా.చంద్ర శేఖర్ రావు  గారు , మాట్లాడిన మాటలన్నీ , ఒకే ప్రసంగం లోని మూడు భాగాలుగా, ముగ్గురి నోట విన్నట్టుగా.. అనిపించింది . నా మట్టుకు నాకు.
 ఆ పై, ఏడుగురు కథకులు ప్రత్యక్షంగాను, ఇరువురు పరోక్షంగాను  పంచుకొన్న వారి కథారచనా అనుభావాలు ఎంత హృద్యంగా సాగాయో.
ఆవేశం, ఆగ్రహం, వేదన , శోధన , నిశ్శబ్దం, నిబ్బరం, ఆశ్చర్యం, ఆనందం.
 ప్రేక్షకుల స్పందనలు. కథకుల ప్రతిస్పందనలు.  
 అలాగే, జంపాల చౌదరి గారు, పాలన గారు, "లియోసా" సంపత్ కుమార్ గారు, మాధవ్ మాచవరం గారు మరికొందరు పంపిన శుభాకాంక్షలను అందరితో పంచుకొన్నాము.
కథకులు అమరేంద్ర దాసరి గారి అభిప్రాయాలు, పాఠకులు డా. అరుణా పాణిని గారి అభిప్రాయాలను ప్రేక్షకులతో పంచుకొన్నాము.
Sa vem Ramaesh garu, Uma maheswara Rao garu
 సాయంకాలం , సముద్రం గాలిని ఆస్వాదిస్తూండగానే , వీడ్కోళ్ళు మొదలయ్యాయి.
మిగిలిన వారమంతా, గుడిసె కింద చేరి , కారం దోశెలు తింటూ, కబుర్లు పంచుకొన్నాము. వెన్నెలని చూస్తూ ...
 భగవంతం, స వెం రమేశ్ గార్లు, చిన్నారి "రాగలీన" ల పాటల వానలో తడిచి ముద్దవతూ...
Anil Atluri garu, Sindhu Madhuri garu 
ప్రభవ వేదిక తీరాన దొరికిన సముద్రం గవ్వలను గుప్పిట్లో దాచుకొంటూ...
***
కథ కంచికి.. మనం ఇంటికి !
***
అదన్న మాట!
చిమ్మ చీకటి నుంచి వెన్నెల వెలుగుల దాకా నిన్నటి కథ-2013 ఆవిష్కరణ సంధర్భంగా సాగిన పడవ ప్రయాణం!
***P.S. Epiphany కి ఈ కింది అర్ధాలు ఉన్నాయి. బహుశా ,"సాక్షాత్కారం" దగ్గరగా ఉండే పదమేమో.. ఎందుకో .. పరిణితి .. అన్న మాట బావుంటుందనిపించింది.
 A sudden manifestation of the essence or meaning of something.
 b. A comprehension or perception of reality by means of a sudden intuitive realization:
 ***
Over a cup of Tea:  Manchikanti and other friends.

Sindhu Madhuri ,Subhadra GovindaRaju and Freinds
Penugonda, EetakOta, PapinEni, Uma Maheswara Rao,
Anil Atluri ,Bhagavantam,Vishnu,S reeramana garu


***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.





Apr 8, 2014

కథల వరదగుడేసే !

నమ్మశక్యంగా లేదు కానీ,
ఇది నిజం!

"వాన చినుకు రాలలేదు ఏమి సేతురా" అని వాపోతూ ఉంటే, ఒక్కసారిగా వరద వచ్చి పడ్డట్టు ,
మన వూరికి కథకుల ముసురు పట్టేసింది!
ఇక ,ఇప్పుడో అప్పుడో కథలముచ్చట్లు కురవడమే తరువాయి!

దానికి తోడు,  అవునన్నది ఆలస్యం ,మన ఈత కోటసుబ్బారావు గారు ముచ్చటపడి ,
కల్యాణమండపం కూడా సిద్దంచేసేసారు.
 ఇకనేం, కథకు కల్యాణఘడియలు వచ్చేసాయి !
శుభం ! శుభస్య శీఘ్రం!

ఇందు మూలంగా మడత పేజీ పాఠకులకు తెలియజేసేదేమిటంటే,
మన నెల్లూరు  గాంధిబొమ్మ వద్ద  తిప్పరాజు కల్యాణ సదనంలో,
"కథ 2013" ఆవిష్కరణ జరుగుతుందహో !

కథను అభిమానించేవరందరికీ ఒక రహస్యం .
"కథ -మానవసంబంధాలను" పెట్టెలో భద్రంగా సర్దుకొని, జాగ్రత్తగా రైలెక్కి రాబోతున్నారు శ్రీ రమణ గారు ..

గొంతుసవరించుకొంటూ గంభీరస్వరంతో...శివా రెడ్డిగారు... ప్రకటిచేయబోతున్నారు.
"కవి అయినా కవిత్వమైనా  కాబోదేది కథాభిమానానికి అనర్హం...!"
 మాయాలాంతరు  చేత పుచ్చుకొని వారి తో పాటు వస్తున్నారు... డా.వి.చంద్రశేఖర రావుగారు,
"అబ్బే!  మేమేం చేశాం..మీరు రాసిన కథలను ఒక చోట అచ్చేసేసాం.అంతేగా.." అంటూ , ఒకింత అమాయకంగా నవ్వుతూ నవీన్ గారు, గుంభనంగా చూస్తూ పాపినేని శివశంకర్ గారు..

"ఒకరా ఇద్దరా.. ఇందరు కథకులు ఒక్కచోట చేరుతున్నారు "అని కబురొస్తే,
ఆహ్వానాలు అందలేదనో ... పిలుపులు ముందూ వెనుకలయ్యాయనో ...
విసుర్లు విసరనూ మూతిముడవనూ అలకపానుపులెక్కనూ...
మనమేమైనా వియ్యాలవారిమా  ?
చక్కటి పాఠకులం!

ఇంకెందుకు ఆలస్యం,
వివరాలకోసం "ప్రభవ"కు రండి.

స్థలప్రభావం చేత నో , ఆడపిల్ల పెళ్ళి చేస్తున్నంత శ్రద్ధాసక్తులతో
ఇటు సుబ్బారావు గారు, అటు ఉమా మహేశ్వరరావు నడుం బిగించారు కనుక ..
మన లాంటి పాఠకులం తలా ఒక చేయి వేసి ... కాస్త చెవిఒగ్గి ... కళ్ళప్పంగించి,
కథకు కల్యాణం జరిపించేద్దామా?
24 వ సారి!

ఏటేటా ముచ్చటగా జరిగే,సీతారాములోరి పెళ్ళిలా!

అవును మరి,
కథ పట్ల అభిమానం ఉన్నవారు ఎలా కాదనగలరు?
అప్పుడు,
కథల వరదగుడి విరయదూ?
మండుటెండలో మల్లియల్లా!

***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Apr 3, 2014

ఆకాశమే వారి హద్దు !

అనగ అనగా ఓ అబ్బాయి!
ఆకాశమంత ఆలోచనలు అతడివి!

అతనిలాంటి మరికొందరు తోడై,
వారందరి ఒంటరిభావనలు
సంఘటితమయ్యే క్రమంలో ...

మీ ఆలోచనలూ అనుభవాలు ..
వారికి బాసటై బాటై...
ఒక దిశానిర్దేశానికి
ఇస్తాయని ఆశిస్తూ...

పరిచయం చేస్తున్నా...

https://www.facebook.com/StudentThinkTankForIndia

యువ మనస్కులకు...
అందరికీ ఆహ్వానం!

***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.