Dec 14, 2015

వారింట పూచిన పూలు !

డాక్టర్ల ఇళ్ళంటే ,
ముఖ్యంగా మాబోటి చిన్నాచితక పట్టణాళ్ళో ,
ఎవరో నియంత్రించి నట్లు, మూసపోసినట్లు , 
ఒకేలా ఉంటాయి.
కింద ఒకటో రెండో అంతస్తులు ఆసుపత్రి .ఆ పైన మెట్లెక్కితే ఇల్లు.
 ఒక విధంగా, రోగులు, వారి బంధువులు ,పుట్టే బిడ్డలు, గిట్టే ఊపిరులు.నిలబడే ప్రాణాలు.నిలకడ లేని క్షణాలు. నమ్మకం. అపనమ్మకం.
ఒక వైపు ఆనందం, ఒక వైపు విషాదం. ఓ పక్క నిబ్బరం మరో పక్క నిస్పృహ .
 అటు జీవితం పట్ల చివరి ఆశ. ఇటు జీవితం చిగురించిన  సంబరం.
అనేకానేక భావోద్వేగాలు కిక్కిరిసిన ఆ జాగాల్లో... మేడ మెట్లెక్కిన నిశ్శబ్ద ఆవాసాల్లా ఉంటూ ఉంటాయి.ఆ ఇళ్ళు.
 ఇరుగు పొరుగు , ముంగిలి లోగిలి అన్నీ , ఆ ఇళ్ళ వాకిళ్ళలో   ఆగి , ఊరించే  జ్ఞాపకాలే.
వూళ్ళో ప్రతి ఒక్కరికీ , ఆ ఇంటి చిరునామా తెలిసే ఉంటుంది. వారికో,వారి బంధు మిత్రులకో ఎప్పుడో ఏదో
అవసరానబడి ఆ గడప తొక్కే వుంటారు.
అలాంటి ఒక ఇల్లే , కొత్త గూడెంలోని డా.శ్యామలాంబ ,డా .నరేంద్ర కుమార్ గార్లది.  వారి ఆసుపత్రి మిద్దె మీది ఇంటి లో ఉన్నంతలోనే, కాస్త చోటు చేసి, బోలెడు మొక్కలను ఆప్యాయం గా    పెంచుకొంటున్నారు.

ఒక చిన్న తూగుటుయ్యాల ,కొన్ని కుర్చీలు ఎప్పుడూ సిద్ధంగా వుంటాయి . అలసిన డాక్టర్ దంపతులు సేద తీరడానికే కాక ,వచ్చే పోయే అతిథులకోసం.
శ్రద్ధగా ఎంపిక చేసుకొన్న పుస్తకాల ఖజానాలో వేలు పెడితే, ఇక అంతే. ఆ ఉయ్యాల్లో కూర్చుని , నరేంద్ర గారి చేతి ఆకుపచ్చ తేనీరు చప్పరిస్తూ,శ్యామల గారి హిమాయల సానువుల్లో ని ,పూలలోయల సోయగాల ముచ్చట్లువింటూ, పుస్తకాల కబుర్లాడుతూ కూర్చుంటే,
రోగాలురొప్పులు మంత్రం  వేసినట్లు మాయమై పోవూ ?
మరో వైద్యం కావాలేంటి ? 


డా.శ్యామలాంబ, డా.నరేంద్ర కుమార్ దంపతులకు స్నేహంతో,అభిమానంతో.)










All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Nov 21, 2015

తెలుగు విడుపరి

సన్మానపత్రం అందజేస్తున్న శ్రీమతి మార్టూరి పద్మావతి గారు. వేణుగోపాల రెడ్డి గారు,మార్టూరి వసంత్ నాయుడు గారు , సామల రమేష్ గారు. పుష్పరాజ్ గారి కుమారుడు. 


వారు ఒక ప్రవాసాంధ్రులు.
వారు  ఒక తెలుగువాచకం అచ్చు వేశారు. 
వారు చాలా కాలంగా తెలుగు పాఠాలు చెపుతున్నారు.  

ఖచ్ఛితంగా , వారు భాషావేత్త, పండితులు,అధ్యాపకులు, ఆ పై సంపన్నులు అయి ఉండాలి. సాహిత్య మారాజ పోషకులు అయి ఉండాలి .
ప్రవాసాంధ్రులకు  తమ పిల్లలకు తెలుగు నేర్పించాలన్న తాపత్రయం ఎక్కువ గనుక, ఈ సంధర్భాన్ని బాగా సొమ్ము కూడా చేసుకొని ఉండవచ్చు ! 
బోలెడంత ప్రచారము ,ఆ దరిమిలా కొండంత కీర్తి అబ్బి ఉంటాయి. 
అటు ప్రభుత్వము ఇటు విశ్వవిద్యాలయము బ్రహ్మాండంగా సహకరించి ఉంటాయి. 

బర్మానాయుడి గారిని పరిచయం చేస్తున్న స వెం రమేశ్ గారు. 
మొదటి మూడు వాక్యాలు మినహా, మిగిలినవేమీ ,వారు  కాకపోవడమే మొన్నామధ్యన జరిగిన ఘన సన్మానానికి మూల కారణం.
 బర్మా నాయుడిగా పేరు పొందిన  శ్రీ యర్రా నాయుడు గారు, అతి సామాన్యులు. అనామకులు. బర్మలో కనీస జీవనాన్ని సాగిస్తోన్న అనేక మంది తెలుగు వాళ్ళ చేతిలో తెలుగు అక్షరాన్ని పెట్టిన , బర్మా నాయుడు  గారు చదివింది రెండో తరగతి. తన కనీస అవసరాలను అతి కష్టాన తీర్చే పనుల్లో ఉన్నా, బర్మాలో తనలా ఉన్న అనేక మందికి తెలుగు పట్ల ఉన్న మమకారాన్ని గుర్తించి , వారికి తనకు తెలిసిన అక్షరం ముక్కను పరిచయ్మ్ చేసారు. ఆ సంధర్భంగా , ఒక వాచకం అచ్చు వేయాలని తాపత్రయ పడి, కాళ్ళరిగేటట్లు అన్ని చోట్లా తిరిగినా ఫలితం లభించక పోవడంతో ,చివరికి తనే ఆ ఫనికి పూనుకొన్నారు. ఆ సంధర్భంగా , స .వెం.రమేశ్ గారి ఎల్లలు ఎరుగని తెలుగు పాఠాల గురించి తెలవడమూ, తెలుగు వాణి పరిచయమూ , ఒక వాచకాన్ని రూపు దిద్దించాయి. 
యర్రానాయిడి గారి పెట్టుబడి తెలుగు పట్ల మమకారం. ఆదాయం నలుగురి చేతిలో ఒక అక్షరం ముక్క పెట్టగలిగానన్న ఆనందం .ఆయన మిగుల్చుకొన్నదీ ఆ అనుభూతిని. అంతే. 
  శ్రీ కంకణాల B.W.J. ఫుష్పరాజు గారి పేరిట  శ్రీమతి మార్టూరి పద్మావతి గారు గారు అందజేసిన  "తెలుగు విడుపరి" గౌరవ సత్కారాన్ని , మొట్ట మొదటి సారి యర్రా నాయుడి గారికి  అందజేసారు. బర్మా నాయుడు గారు ఆ సంధర్భంగా అందజేసిన ధనానికి తన కష్టార్జిత సొమ్మును మరికొంత జత పరిచి, తెలుగు అక్షరం అభివృద్దికే వినియోగించమని ,తెలుగు వాణి కి బహుకరించారు. యర్రా నాయుడి గారి నుంచి ఎంత నేర్చుకోవల్సి ఉన్నదో! గౌరవ వందనం. వినమ్రంగా .

స వెం రమేశ్ గారు,వసంత్ నాయుడు గారు ,తదితర తెలుగు అభిమానులు.

Nov 9, 2015

రేగడి నీడల్ల


రేగడి నీడల్ల పొత్తం వెలువరింత వేడుక .
నాణ్ డు :శనివారం తావు :ఉడుముల పేట.

సామలు శ్రీమతి చెన్నా కల్యాణి , మార్టూరి పద్మావతి గార్లు ఒక మామిడి మొక్క నాటి , మనవరాలు మార్టూరి సంజనా పద్మం రాసిన పుస్తకాన్ని విడుదల చేసారు. 
సంతోషంలో అబ్బా అమ్మ , 
సంజనలో సృజనశీలత ను గుర్తించి నాలుగేళ్ళ కిందటే "Creative Thinker " అని అవార్డ్ ఇచ్చి ప్రోత్సహిస్తూ ,సంజన పక్కన నిలబడ్డ బడి పంతులమ్మ ,
తెలుగు అక్షరాలని చిన్నారి సంజన చేతిలో పెట్టి, గుంభనం గా ముసి ముసి నవ్వుతూ వేదిక ముందు కూర్చున్న అయ్య వారు , స. వెం. రమేశ్ గారు.
చప్పట్లు కొడుతూ మేమందరమూ.












All rights @ writer. Title,labels, postings and related copyright reserved.