అక్కను నేను ! రష్షించేస్తాను !
బడిలో బాలికల కొత్త బాట !
" మేం చేసిన రాఖీలు వాళ్ళకు కట్టాము. వాళ్ళు చేసిన రాఖీలు మాకు కట్టాలి కదా?
మాకు ఎందుకు రాఖీలు కట్టరు ? " బుద్దిమాన్ బాలిక సూటిగా అడిగింది.
"ఎప్పుడూ మేమే కట్టాలా?" అన్నుల మిన్న అలిగింది.
"సుశ్రుత్ ను నేనూ, ధీరూ ని అక్షర, వరుణ్ ని తాన్వి ... బాగా రష్షిస్తున్నం కదా? మాకెందుకు రాఖీ కట్టలేదు?" తస్నీం గట్టిగా అడిగింది.
***
"అక్కా , నా రాఖీ నీకు కడతా" కనిష్క అడిగింది.
"నేను బాను అక్కకు కడతా!" ఋత్విక మెల్లిగా అంది.
"మరి స్వప్నక్క కి ? నిరోషక్క కి?"అన్విత జ్ఞాపకం చేసింది ."ప్రియక్కకు కూడా! "
"అక్కలకు కాదమ్మా , అబ్బాయిలకు కట్టాలి !"
"మీరే కదా చెప్పారు. రష్షించే వాళ్ళకు కట్టాలని! మీరే కదా మమ్మల్ని రష్షిస్తారు ?" బుద్ధిమాన్ బాలిక ఘర్జించింది.
***
"రక్షించడం అంటే ఏంటమ్మా?" అక్క అడిగింది.
" బాగా చూసుకోవడం!"
టకీమని సమాధానం.
ఏ మాత్రం తడబడకుండా !
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
Yes , why not?
ReplyDeleteAvunu manake kattaali kaneesam thommidi nelalu potyalo raksjinchinandikaina
ReplyDeleteThanks to all of you.
ReplyDelete