ఒక రోజు మధ్యాహ్నానికి కాస్త ముందు. అనుకోని దూరవాణి పలకరింపు.అభిమాన రచయిత్రి డి.కామేశ్వరి గారి నుంచి.
మరింత ఆశ్చ్యర్యంగా ,ఎంతో దగ్గర గా నెల్లూరి నుంచే.
"ఎలాగు వచ్చాం కదా, పలకరిదామని", అన్నారు తమ ఆత్మీయ స్వరంతో ,"వీలుంటే కలుద్దామని !"
ఇంకేం, వారికి కనబడలేదు కానీ, చేటంత మొహం చేసుకొని గబ గబ గబా తలాడించాను.
కాకపోతే, నాతో పాటుగా వారిని కలవడాని ఇష్టపడే ఆత్మీయులు కొందరిని
పిలుస్తానన్నాను. వారికి అభ్యంతరం లేకపోతే.
ఎలాంటి పటాటొపం లేకుండా, వెంటనేవప్పుకొన్నారు.
ఆ తక్కువ సమయంలోనే, నాయుడు పేట నుంచి ప్రతిమ వచ్చేస్తే, కాలేజీ ముగించి శోభాదేవి గారు వచ్చారు.ఆసుపత్రికి కాస్త విరామమిచ్చి, జయప్రద గారూను. ప్రభవ కబుర్లతో కళకళలాడింది.కామేశ్వరి గారు , చిరునవ్వుల జడిలోనే ఉరుములు మెరుపులు , కొండొకచో పిడుగులు కురిపించారు. తమ ప్రసంగంలో. ఆపై ,సంభాషణల్లో. అప్పటి జ్ఞాపకాల చిత్రాలివి!

No comments:
Post a Comment