సరిగ్గా ఇదే సమయానికి, గత పాతికేళ్ళుగా .. .
ఒక నాదస్వరం మా వీధుల్లో .. ప్రయాణిస్తూ ఉండడం పరిపాటి.
ఎవరెవరం ఎక్కడెక్కడ దాక్కున్నా ,
ఆ వీధిలో నుంచో ఈ వీధిలో నుంచో .. ఆ స్వరం
అదాటుగా వచ్చి పలకరించి పోయేది. అలవోకగా ముంచెత్తుతుంది .
పేపర్లో తల దూర్చినా, దుప్పట్లో ముసుగెట్టినా , కంప్యూటర్లో
మునిగిపోయినా ..వెతెకెతికి మరీ తలలో దూరి కూర్చుంటుంది. వదిలితే
వొట్టు.
ఇక ఆ రోజంతా , బుర్రలో తిరుగుతూ ... ఉంటుంది.
ఆ
స్వరంతో పాటు, ఆ పాట.. వదలమన్నా వదలదు.
అంతా చేసి ఆ నాలుగు వాక్యాలే, మళ్ళీ మళ్ళీ.
అప్పుడప్పుడు, “ నీలి మేఘాలలో .. గాలి కెరటాలలో…. “
ఈ పాటా ఆ నాలుగు వాక్యాలే !
ఆ స్వరం వెనుక మనిషెవరో కూడా తెలియదు. కానీ , ఆ స్వరమంటే
అంతులేని అభిమానం.
ఎంతగా అలవాటు పడ్డామంటే , ఆ సమయానికి ఆ పాట వినబడక ఆ రోజంతా ఏదో లోటుగా ఉంటుంది మరి!
నిజానికి, రాను రాను ఆ పాట రాక తగ్గుతూ వస్తొంది. కొన్ని రోజులు వినబడనే
వినబడడం లేదు. అయినా, ఓ చెవి ఆ వైపు అప్పగించేయడం అలవాటయి
పోయింది.
ఇదలా ఉండగా,
ఈ మధ్య ఓ పెద్ద హోరెంత్తించే మైకులో …పొద్దున
పొద్దున్నే ...
“ నెల్లూరు నెరజాణా…” అంటూ..
చెవుల తుప్పు వదిలేలా ,బిగ్గరగా పాట
మా వీధులని సాధికారకంగా చుట్టేస్తోంది!
హమ్మయ్య ,పాట కాదు…స్వరమే!
బతికాం!
“ ఎంత నెరజాణతనమయితే మాత్రం అలా మైకులు పెట్టి వీధుల్లో ప్రకటించుకోవాలా
! సిగ్గులేక పోతే సరి ! “అని గట్టిగా గొణుక్కోకండి. పాపం ,అదేదో, మంచి మాటని
ఉప్పొంగిపోయే వారు బోలెడు నెల్లూరీయులు!
పాపం శమించు కాక !
స్వరం ... ఆ వెంటనే .. సైరనూ..కుయ్ కుయ్
మని... బిగ్గరగా వినబడుతుంది.
“
అమ్మా…. మున్సిపల్ వాహనం వచ్చింది
మీ ఇంటి చెత్త ఇవ్వండీ ! “
ఇదేదో బాగానే ఉంది !
అప్పడప్పుడు ఇలాంటి .. అయిడియాలు ..భలే వచ్చేస్తాయి మన వాళ్ళకి !
ప్రహసనంగా మారేంతవరకూ, ఓకే !
ఇంతా చేసీ , మా వీధుల్లో మున్సిపల్ చెత్త కుండీలన్నీ , కబ్జా అయిపోయాయి. వందలాది చిన్నచితక ఆసుపత్రుల వీధులు కదా. ఎప్పుడైనా
"చెత్తకుండీలో పసిపాప" లాంటి వార్తలు వచ్చే వంటే , అది ఖచ్చితంగా మా వీధి చెత్తకుండీనే అయి ఉండేది !
ఇప్పుడిక , చూడాలి!
***All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
No comments:
Post a Comment