గణతంత్ర దినోత్సవం కదా .. పిల్లలకి
భారతసామ్రాజ్యం .. పాఠం చెబుదాం అనుకున్నాం.
వెంటనే, మహారాజూల్నీ, మాహారాణులనీ, చక్రవర్తులనీ ,సుల్తానాలనీ,పాదుషాలని.. చిట్టా రాసి, ఓ తొమ్మిది మందిని .. పట్టీ రాశేసాం. పిల్లలు తలా ఒక పాత్రలోకి ఒదిగి పోయారు. ఈ నాలుగు రోజులు, కత్తి యుద్ధాలు ,గుర్రాల సకిలింపులు , ఏనుగు ఘీంకారాలు.ప్రభవ దద్దరిల్లిపోయింది. ఇక , ఇవ్వాళ అందరూ .. వరస గా వేదికెక్కి తమ తమ పాత్రలను ఆఖరి మెరుగులుదిద్దుతూ , దడలాడించేసారు.సోమవారం ప్రదర్షన. ఇంతకీ, చెప్పొచ్చేదేమిటంటే, ఆఖరి పాపాయి, అశొకుడి పాత్రలో జీవించగానే, అప్పటిదాకా రణగొణ్వనులు చేస్తోన్న యుద్ధవీరులంతా.. కిక్కురుమనడం మానేసి, ఒక తదేక దృష్టితో .. అశోకుడి వైపు ..చూస్తూ .. అన్నారు.
" ఈ కింగ్ చాలా గుడ్!"
" ఏం ?"
"అందరూ కత్తితో కిల్ చేస్తారు. వాళ్ళు చాలా బాడ్ !"
ఇందుమూలంగా, సోమవారం నాడు అశోకుడికి ఎక్కువ సమయం ఇవ్వాలని పిల్లలు ఏక గ్రీవంగా తీర్మానించారు.
మా వరసలో ,చిట్టచివరి స్టార్ ఎంట్రీ "సామ్రాట్ అశోక" అన్నమాట!
మేము చెప్పదలుచుకొన్న పాఠం ఏదైనా మిగిలిందా ?!?
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.