నిజమే!
నిర్మించుకోవడం లో ఆనందం ఉంది.
పెంపు సొంపు అన్నారు కదా.
ముచ్చటగా.
ముచ్చటగా.
పునర్నిర్మించుకోవడంలో అంతులేని వేదన ఉంది.
వాస్తవం.
మానని గాయాలు సలుపుతోంటే,
మానుతోన్న గాయాలు కలుక్కుమంటుంటే,
గుండెలు చిక్క బెట్టుకొని ..
ఒక్కో క్షణాన్ని నిర్మించుకొంటూ రావడం ...
ఎంత కష్టం!
దిగ్బ్రమల నుంచి తేరుకొంటూ
... దుఃఖాన్ని అణుచుకొంటూ ...
దిగులొందుతున్న మనసును ఓదార్చుకొంటూ..
చేజారిన స్నేహాలనీ ..ఎదుట
నిలిచిన మోసాల్ని ...
దాటి వచ్చిన కష్టాన్ని ..నష్టాన్ని..నిష్టూరాన్ని ...
మరుపుబుట్టలో
దాచేస్తూ..
వర్తమానాన్ని జ్ఞాపకాలతో
బేరీజు వేసుకొంటూ...
భవిష్యత్తు పట్ల భరోసా
నింపుకొనే ప్రయత్నం చేస్తూ..
పాతను వదులుకోలేక ..
కొత్త చేసిన పరిస్థితులను వంటబట్టించుకొనే ప్రయత్నం చేస్తూ..
కొత్త చేసిన పరిస్థితులను వంటబట్టించుకొనే ప్రయత్నం చేస్తూ..
పోగొట్టుకున్నదేమిటో ..పొందవలసినదేమిటో..
తెలిసీ తెలియని అయోమయంలో..
తలకొక మాట .. చేష్టలుడిగిన చేత ..
ఎవరికి వారం ..
నిశ్శబ్దంగా ..
ఒక్కో నిమిషాన్నీ
నిర్మించుకొంటూ రావడం...!?!
సులువని ఎవరనగలం?
***
నిన్న నిన్నలా లేకుండా
పోయింది.
రేపు ఎలా ఉండబోతోందో తెలుస్తూనే ఉన్నది.
రేపు ఎలా ఉండబోతోందో తెలుస్తూనే ఉన్నది.
నిన్నటికీ రేపటికీ నడుమ..
ఓ ప్రశ్నార్ధకంలా
ముక్కలైన
ముక్కలైన
నేడు !
***
శాంతి శాంతి శాంతి !
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
Chandra Latha Gaaru,
ReplyDeleteVery well expressed.
rebuilding is always a pain but not impossible, moreover can be built better from the lessons learned.
Surabhi
ఏమైనా రేపటి కల ఈనాటి ప్రయత్నాలతోనే సాకారమవుతుంది.నిన్నటి వ్యధ నేటి కృషికి అనుభవంగా తోడ్పడాలి.
ReplyDelete