బుద్దిమంతురాల్ని కదా,
కాస్త ఆలస్యం గానే పేపరు తిరగేస్తా.
ఈ పూటా మరీను.
మొదట పేజీలో ,కొట్టొచ్చినట్టుగా ఓ ఫోటో,నన్ను ఇట్టే కట్టేసింది.
" కష్టకాలంలో మీకు అండగా ఉంటాం"అంటూ!
కష్టకాలం ఎవరికబ్బా అన్న ప్రశ్న ఓ పక్క ములుకులా గుచ్చుకొంటున్నా, ముచ్చటగా ఉన్న ఆ చిత్ర రాజాన్ని మెచ్చుకోకుండా ఉండలేం కదా?
నిన్న గాక మొన్న, కలవర పడ్డవారంతా, కంగారు పడ్డవారంతా, రెండురోజుల్లో కుదుటపడ్డారంటే మాటలా!
కళలాడుతోన్న ముఖాలు. తళతళలాడుతున్న ధవళ వస్త్రాలు.
ఏదో సబ్బుబిళ్ళ ప్రకటన కోసం తీసినట్టు.
చక్కటి ఫ్రేమింగూ టైమింగూ .
అద్బుతమైన రంగులు హంగులు.వెలుగులు నీడలూ.
అమ్మ వారి దర్శనం చేసుకొని తిరిగి వస్తున్న మన పదకొండు మంది నేతన్నగార్లూ!
అమ్మ వారి ముందు సాష్టాంగ పడ్డారా.అష్టొత్తరాలు చదివారా ..లాంటి కొంటె ప్రశ్నలు అడగబోకండి !
ఉష్!
బహుశా , Ocean Eleven అన్న పేరు ఇలాంటి ఫుటో చూసే తట్టుంటుంది సుమీ!
మాటలా మరి!
తుఫాను రోజుల్లో హెలిక్యాప్టర్ల్లో కూర్చోని ,
గుండెల్లోతు నీళ్లల్లో నానుతోన్న మన మీదకు జాలి గుండెతో విసిరేస్తే ,
నీళ్ళ పాకెట్లు వచ్చి పడ్డటు ,
మన మీదకు ఆ పదివేలకోట్ల ప్యాకేజీలు విసిరిపడేయ బోతుంటే,
అన్నగార్లు హుషారుగా ఎగిరి పట్టుకోవద్దూ?
దొరికిన వారికి దొరికినంత మహదేవ!
నా మట్టుకు నేను ,
"ఇక పై పిల్లల కథల్లో,
సముద్రపు దొంగలంటే అచ్చం ఇలాగే ఉంటారని చెప్పుకోవాలి గాబోలు ! "
అనుకొని బుగ్గలు నొక్కుకొన్నా!
ఎంతైనా సముద్రపు తీరాలను నమ్ముకొన్నవారం ,సముద్రపు ఉప్పు తినే వాళ్ళమయ్యే !
కదండీ!?!
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.