“ కొండపల్లి కొయ్యబొమ్మ
నీకో బొమ్మ
నాకో బొమ్మ “
దసరా పండుగ అంటేనే “అయ్యవార్లకు
పిల్లవాండ్ర”కు కు సంబందించినది.
పాఠాలకు సెలవిచ్చి కాస్త సేదదీరే
సమయం ఇది. అంతే కాదు, ఇది బొమ్మల పండుగ. పిల్లలకు
బొమ్మలకు ఉన్న అనుబంధం చెప్పవలసింది ఏముంది ?
మన సంస్కృతిలో ఒక్కో పండుగ ఒక్కో
పనితనాన్ని గౌరవించేది. దసరా పండుగ పిల్లలకు ఎంతో ఇష్టమైన బొమ్మల కళాకారులను గౌరవించేది.
దసరా నాడు మన ఇళ్ళల్లో కొలువు దీర్చే బొమ్మల అందం
చందం చూసి తరించ వలసిందే.
అందులోను , స్థానికంగా తయారయిన
కొయ్యబొమ్మలు అక్కడ ప్రత్యేకంగా నిలవవలిసిందే.
బొమ్మల తయారీ సజీవంగా ఉన్న ఒక చేతివృత్తి. కుటీరపరిశ్రమ.
తరతరాలుగా మన సంస్కృతి లో అంతర్భాగమై
పోయిన ఈ సాంప్రదాయాన్ని మన పిల్లలకీ పరిచయం చేయడానికి , ప్రభవ బడిలో బొమ్మల కొలువు నిర్వహించాము. వారి వారి ఇళ్లనుంచి తమ బొమ్మల ను చేతబట్టుకొని బుట్టబొమ్మల్లా తరలివచ్చిన పిల్లలు పువ్వులు కళ్ళారా చూడవలసిందే!
"పిల్లవాండ్రకు చాలు పప్పుబెల్లాలు"
దసరా పండుగ శుభాకాంక్షలు.
మీరూ ఓ మారు ప్రభవ బడిలోకి వచ్చి చూడండి మరి.
బొమ్మల కొలువు
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
No comments:
Post a Comment