Nov 30, 2011

ధన్యోస్మి మిత్రమా ..!

నేస్తమా...
ఆత్మీయతా అనురాగాల నిలువెత్తు దోస్తూ..
కోటపాటి!

1959  లో పల్నాడు పిడుగురాళ్ళలో  కలుసుకున్నాము. ప్రాంతీయత, సన్నిహితత్వం, మాట మనసుల మమైక్యం మనల్ని అచిరకాలం లోనే మైత్రి బంధితులను చేసింది. ధోతి లాల్చి ఉత్తరీయాల ఠీవీ లో.. పాతికేళ్ళ యుక్తవయసులోనే ..పెద్దరికం పూత పూసిన చిరునగవుల మిత్రులిద్దరూ... పంచాయితీ సమితి ఆఫీసు కు వెళ్లి వస్తూ ఉండడం కళ్ళుకుట్టే సదృశ్యమే ఊళ్ళో పెద్దలు - పెద్ద,చిన్న నాగయ్యలు కోరి స్నేహం చేసుకున్నారు. విద్యాధికులు శ్రీ వేమా రెడ్డి మిత్రులైనారు చిరుత ప్రాయం లో ఉన్న మా చిన్నారులు వారి కుటుంబ ప్రేమాభిమానాలకునోచి పెరిగారు.
ఆనతి కాలం లోనే నేను ఉపాధ్యయునిగా మరొక గ్రామానికి బదిలీ కాగా మిత్రుడు మురహరి నరసరావుపేటకు మకాము మార్చారు. కలిసి పని చేయక పోయినా  మా చిన్నవాడికి మిసన్ హాస్పిటల్ లో దీర్గకాలిక అనారోగ్యానికి చికిత్సకై మిత్రుని ఇంటనే బస, శ్రీమతి సరోజిని మురహరులే ఆపత్ భాంధవులు  .
కౌన్సిల్ ఎన్నికలలో మిత్రుడు పుతుంబాక కు  అండగా ఉనందున లోకల్ నాయకునికి (నాటి మంత్రి) వ్యతిరేకమైనందున సుదూర మెహబూబ్ నగరి కాతడు విసిరి వేయబడగా సైనిక స్కూల్ కు నేను చేరినా మిత్రత్వ సాన్నిహితత్వం సజీవమే. ప్రకృతి పంపున ఎక్కడి వితో మరెక్కడో మొక్కై   మానై  పుష్ప ఫలాదుల విరిసినట్లు మహబూబ్ నగరి లో ఈ మురహరి వట వృక్షమై భావ వీచికల పలకరింత ---- ఒకసారి మా వ్యవసాయ క్షేత్రాన్ని అవలోకించి ఆనందం పంచుకుందాం రా రమ్మని.
అప్పటికే బిడ్డలతో... ఉమ్మడి కుటుంబ వికాస విస్తరణలో  ఉన్న మిత్రుడు "నా పిల్లల విద్యాభివ్రుదికి  తోడ్పడు, నీకుగా వ్యవసాయ క్షేత్రం నేను చూసుకుంటాను" అని, ఎంత భరోసా?
పిల్లల పెరుగుదలలో తల్లి దండ్రులు కాక ఇతరుల ప్రమేయం మంచిది కాదు అనే నెపంతో తప్పుకొనడం మిత్ర భేధమేనేమో!
 మరొక సారి తను సినిమా రంగ ప్రవేశము గురించి ప్రస్తావన రాగ, సినిమా రంగపు హంగు రంగులు మనకు లేవు కదా? తగదేమో? అన్నదే తడువుగా "మిత్రుడు శ్రీ రామ నాయుడు సహకారం తో సరదా పడ్డాను.  కాని నీవు చెప్పినట్లు మనకు తగదని తెలిసి విడాకులు ఇచ్చెసానూ"
వృత్తిరిత్యా బాధ్యతలలో తలమునకలుగా నేనుండగా,
 అతడు విత్తుల విపణిలో ఎత్తుల కెగసి సాహిత్య సామాజిక సేవారంగాలలో సేద  తీరుతూ... కుటుంబ భాద్యతల సఫలీక్రుతులవుతూ ... ఎడనెడ కలుస్తూ .జీవిత మజిలీల కతాకథనాలు ఎరుగుతూ ఒక వివాహ సందర్భం లో కలిసి, చంద్రలతార్భాట పుష్ప విరాజిత రేగడి విత్తుల తానా సుగంధ సువార్త తో గాని తన ప్రతిభ కుటుంబ క్షేత్రములో పరిడవించిన రీతి నాకెంతో మేలుకొలుపు. దృశ్యా దృశ్యం గా నవలాలతలతో దగ్గరగా జోచాము.
పెద్దల తరం స్తాపించిన పాఠశాల ద్వారా గూడవల్లిలో యువత దెశ విదేశాలలో విస్తరించగా సన్న కుటుంబీకుల దన్నుగా ఐ. టి. ఐ స్తాపనలోను,  విశేష కీర్తి గడించిన కావూరి ఆశ్రమం కాలగర్భంలో కృంగిపోతున్న దశలో,
అదునాతన  విభాగాన్ని ప్రారంభింప చేయడంలో అతడు అజ్ఞాత కృషీవలుడే!
ఆ స్పూర్తితోనే ఏబదేండ్లనాడు అతి స్వల్ప స్నేహానుబందం  పూస్తున్న రోజుల్లోనే..
తన మిత్రుడు అసెంబ్లీ లో స్వతంత్ర ఎమెల్యే నాయకుడు నారాయణ రెడ్డి గారిని, మీత్రుడు కాంతా రావు గార్లతో మా సనాతన వేదాంత నిష్టాస్రమ ఉత్సవాలకు అతిడులుగా విచేయడం మినహా వారి గ్రామస్తులు మా  పాఠశాల లో ఉపాధ్యాయులుగా ఉన్నారని వార్తా విన యెబదేండ్ల తరువాత పాఠశాల స్వర్ణోత్సవాలు  యెబదివేల రూపాయల భూరి విరాళము ఇవ్వడానికి. ఎంత గాఢాభిమానము పెల్లుబికిందో ఊహించనలవి కాదు.

ఆ చిరునవ్వుల ఆత్మీయత ఎన్నటికి మాయని మనసు గంధమే


ధన్యోస్మి మిత్రమా ..
కోటపాటి  మురహరి రాయ..
ధన్యోస్మి.

నార్ల చంద్రశేఖరరావు


***



Kotapati Murahari Rao RIP


http://gaddeswarup.blogspot.com/2011/11/kotapati-murahari-rao-rip.html
గద్దె స్వరూప్ గారు 

***

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

1 comment:

  1. జీవితం రైలు ప్రయాణం అని ఎవరన్నారో గాని మీ జీవితంలో మలుపులు, విడిఫోయిన మిత్రులు తిరిగి ఇలా కలుసుకున్నారంటే ఎంతో సంతోషంగా ఉంటుందికదూ.

    ReplyDelete