అన్నీ అమ్మఒడిలోనే మొదలవుతాయిట!
కావాలంటే చూడండి.
చిట్టిచిలకమ్మని కొట్టిందెవరు ?
అమ్మే కదా?
చిన్నారి పొన్నారి కిట్టయ్యను కొట్టిందెవరు?
ఇంకెవరూ..అమ్మే!
పైనుంచి, "అమ్మా మన్ను తినంగ నేను పసిపిల్లాణ్ణా వెర్రికుంకనా" ..అని తిరిగి సమాధానం ..చెపితే..
ఆ యశోదమ్మ కాబట్టి . .. ఆ చిట్టినోట్లో పద్నాలుగు భువన భాండాలు చూసి మురిసి పోయింది .
కానీ,
మన బోటి అమ్మలం నాన్నలం, ఆ ఫళంగా నాలుగు అంటించి ,డెట్టాల్ తో నోరు శుభ్రంగా కడిగి,బుజ్జాణ్ణి భుజాన వేసుకొని, పరుగుపరుగున డాక్టరయ్య దగ్గరకో డాక్టరమ్మ దగ్గరికో వెళ్ళి , పిల్లాడి పిర్రకి ..ఓ TT సూది సురుక్కున పొడిపించేద్దేము.
హన్నా !!!
'నిజమండీ.. పిల్లలా అల్లరి పిడుగులా.. అప్పుడప్పుడు ..ఒకటో రెండో ఇచ్చుకోక పోతే ఎలా' , అంటారా?
ఆగండి, మనూళ్ళో అన్నీ చెల్లుతాయి.
అదే , మనాళ్ళే మన పొలిమెరలు దాటారను కోండి, అదే పిల్లలు కళ్ళేర్ర జేసి.. "ఛైల్డ్ అబ్యూజ్ !" అని కెవ్వున ఓ కేకేస్తే చాలుట.. ఆ సూది మందేదో అమ్మానాన్నలకు పొడిచి పంపుతారాట..ఆయా దేశాలవాళ్ళు.
మరి, అలాంటి దేశాల్లో పిల్లలు పిడుగుల్లా తయారవమంటే అవరూ మరి.
మామూలు పిడుగులు కారు చిచ్చర పిడుగులు!
ఆయా పిల్లల అమ్మానాన్నల సంగతి అటుంచి, పంతుళ్ళపంతులమ్మ ల సంగతి ఏంటో ... పాపం...ఎవరైనా బడిపంతుళ్ళుంటే కాస్త చెప్పండమ్మా..అయ్యా.. విని పెడతాం.
అదలా ఉంచండి. మనూళ్ళో ,మన ఇళ్లల్లో, మన బళ్ళల్లో,
మనమెంత సృజనాత్మకంగా పిల్లలకు మంచీసెబ్బర నేర్పుతున్నామో .. మీకు తెలుసుకదా.
ఆ మాటకొస్తే మనం మాత్రం తక్కువ తిన్నామేంటి,నలుగురికీ తెలిసేట్టు కొడతామా?
పిల్లల్ని కొట్టడం అన్నది అక్షరాలా అరవైఅయిదవ కళ!
అదెలాగంటారా ...?
చదవండి.. ఈ చిన్న రచనను ..పావని మాటల్లో..!
Little Boy "Teddified" !
http://prabhavabooks.blogspot.com/
అన్నట్లు ..
ఇది పావని ప్రయత్నించిన మొదటి రచన.. మీ సలహాలకోసం.
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.