వేసం కాలం.
సాయం సమయం.
సముద్రం గాలులు.
మంచి నిద్రలో కమ్మి వేసే కమ్మటి జ్ఞాపకం లా..
నిలువెత్తు వివశత్వంలో ముంచేయ గలదు ...
అప్పుడప్పుడే విచ్చుకొంటున్న ఒక చిన్న మల్లెచెండు.
ఎప్పుడైనా ఆదమరుపున మనసున మెదులుతుందొక మధురమైన పాట.
మనుసున మల్లెల మాలలూగెనే.. ఎంత హాయి ఈ రేయి నిండెనో ..
అంటూ.
ఆ పారవశ్యం ఆ పాటదా ఆ మాటదా..
ఆ తియ్యటి పలుకు ను ఒలికిన స్వరానిదా..ఆ అందమైన స్వరాన్నిన స్వరకర్తదా..? ఆ కమనీయ భావాన్ని కంటిముందు నిలిపిన ఆ అపురూపమైన జంటదా?
ఏమో?
బహుశా...
ఆ హాయి ..
ఆ వయ్యారి మల్లెలమాలలదేనేమో!
***
All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.
Nice.
ReplyDeletebaagundi.
ReplyDeleteసూపర్బ్ . బీచ్ సీన్స్ గుర్తొచ్చాయ్ నాకు..
ReplyDeleteఇలాంటి కొన్ని పాటలు ఎందుకు నచ్చుతాయో తెలియదు. ఆ పాటలు వింటుంటే ఏదో అవ్యక్తగతమైన అనుభూతి మనల్ని పలకరిస్తుంది. ఎందుకలా జరిగిందంటే మనలో చాలా మంది దగ్గర సమాధానలుండవు. మనసును తాకే ప్రతి భావాన్నీ మాటలతో కొలవడం వీలు కాదని నా నమ్మకం.
ReplyDeleteమల్లెలున్న పాటలన్నింటిలొ, నాకు, " చిగురాకులలో చిలకమ్మా " (దొంగరాముడు సినిమాలో)బాగుంటుంది. కొంచెం ఆలోచనలు, కొంచెం నీతులు, మంచి ట్యూను, వారానికి ఒకసారైనా వింటాను.
ReplyDeleteఏమోనండీ.. కొన్ని ప్రశ్నలకి 'ఎందుకూ?' అంటే సమాధానం చెప్పడం కష్టమే..
ReplyDeleteఇలా నేను మనసు పారేసుకున్న పాట
ReplyDelete"గోరొంక గూటికే చేరావు చిలకా"(సీక్రెట్-చిలకా అన్న చోట నా గర్ల్ ఫ్రెండ్ పేరు గోరొంక అన్న చోట నా పేరు పెట్టి పాడి వినిపిస్తుంటా తనకి(అలా మా నాన్నారు నా చిన్నప్పుడు గోరొంక అన్న చోట ఆయన పేరు చిలకా అన్న చోట కన్నా అని పాడేవారు))
ఇంక నా మనసు దోచుకున్న పాట
చిన్న మాటా ఒక చిన్న మాట(దీనికి పెద్ద ష్టోరీలు లేవు లెండి)
---సంతోష్ సూరంపూడి
చాలా బాగుంది.
ReplyDelete