సన్మానపత్రం అందజేస్తున్న శ్రీమతి మార్టూరి పద్మావతి గారు. వేణుగోపాల రెడ్డి గారు,మార్టూరి వసంత్ నాయుడు గారు , సామల రమేష్ గారు. పుష్పరాజ్ గారి కుమారుడు. |
వారు ఒక ప్రవాసాంధ్రులు.
వారు ఒక తెలుగువాచకం అచ్చు వేశారు.
వారు చాలా కాలంగా తెలుగు పాఠాలు చెపుతున్నారు.
ఖచ్ఛితంగా , వారు భాషావేత్త, పండితులు,అధ్యాపకులు, ఆ పై సంపన్నులు అయి ఉండాలి. సాహిత్య మారాజ పోషకులు అయి ఉండాలి .
ప్రవాసాంధ్రులకు తమ పిల్లలకు తెలుగు నేర్పించాలన్న తాపత్రయం ఎక్కువ గనుక, ఈ సంధర్భాన్ని బాగా సొమ్ము కూడా చేసుకొని ఉండవచ్చు !
బోలెడంత ప్రచారము ,ఆ దరిమిలా కొండంత కీర్తి అబ్బి ఉంటాయి.
అటు ప్రభుత్వము ఇటు విశ్వవిద్యాలయము బ్రహ్మాండంగా సహకరించి ఉంటాయి.
బర్మానాయుడి గారిని పరిచయం చేస్తున్న స వెం రమేశ్ గారు. |
మొదటి మూడు వాక్యాలు మినహా, మిగిలినవేమీ ,వారు కాకపోవడమే మొన్నామధ్యన జరిగిన ఘన సన్మానానికి మూల కారణం.
బర్మా నాయుడిగా పేరు పొందిన శ్రీ యర్రా నాయుడు గారు, అతి సామాన్యులు. అనామకులు. బర్మలో కనీస జీవనాన్ని సాగిస్తోన్న అనేక మంది తెలుగు వాళ్ళ చేతిలో తెలుగు అక్షరాన్ని పెట్టిన , బర్మా నాయుడు గారు చదివింది రెండో తరగతి. తన కనీస అవసరాలను అతి కష్టాన తీర్చే పనుల్లో ఉన్నా, బర్మాలో తనలా ఉన్న అనేక మందికి తెలుగు పట్ల ఉన్న మమకారాన్ని గుర్తించి , వారికి తనకు తెలిసిన అక్షరం ముక్కను పరిచయ్మ్ చేసారు. ఆ సంధర్భంగా , ఒక వాచకం అచ్చు వేయాలని తాపత్రయ పడి, కాళ్ళరిగేటట్లు అన్ని చోట్లా తిరిగినా ఫలితం లభించక పోవడంతో ,చివరికి తనే ఆ ఫనికి పూనుకొన్నారు. ఆ సంధర్భంగా , స .వెం.రమేశ్ గారి ఎల్లలు ఎరుగని తెలుగు పాఠాల గురించి తెలవడమూ, తెలుగు వాణి పరిచయమూ , ఒక వాచకాన్ని రూపు దిద్దించాయి.
యర్రానాయిడి గారి పెట్టుబడి తెలుగు పట్ల మమకారం. ఆదాయం నలుగురి చేతిలో ఒక అక్షరం ముక్క పెట్టగలిగానన్న ఆనందం .ఆయన మిగుల్చుకొన్నదీ ఆ అనుభూతిని. అంతే.
శ్రీ కంకణాల B.W.J. ఫుష్పరాజు గారి పేరిట శ్రీమతి మార్టూరి పద్మావతి గారు గారు అందజేసిన "తెలుగు విడుపరి" గౌరవ సత్కారాన్ని , మొట్ట మొదటి సారి యర్రా నాయుడి గారికి అందజేసారు. బర్మా నాయుడు గారు ఆ సంధర్భంగా అందజేసిన ధనానికి తన కష్టార్జిత సొమ్మును మరికొంత జత పరిచి, తెలుగు అక్షరం అభివృద్దికే వినియోగించమని ,తెలుగు వాణి కి బహుకరించారు. యర్రా నాయుడి గారి నుంచి ఎంత నేర్చుకోవల్సి ఉన్నదో! గౌరవ వందనం. వినమ్రంగా .
స వెం రమేశ్ గారు,వసంత్ నాయుడు గారు ,తదితర తెలుగు అభిమానులు. |