మట్టిలో మాణిక్యాలు దొరుకుతాయి అన్న
మాట నిజమని మరొక సారి నిరూపించింది
క్రియ బాలోత్సవ్ 2015
https://www.youtube.com/watch?v=DdKrakNam84&feature=youtu.be
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
నక్కా అనిత ఆరో తరగతి అమ్మాయి .
పురకట్ల పల్లి జిల్లా ప్రజా పరిషత్ ఓరియెంటల్ హై స్కూల్ లో చదువుతోంది. వాళ్ళ అక్క మౌనిక ఈ ఏడాదే బడి
వదిలి, కాలేజీలో చేరింది. అక్క నేర్పిన పాటను అనిత హృద్యంగా పాడి , అందరినీ కొల్లగొట్టేసింది.
"బువ్వ పెట్టి బుజ్జగించే ఆ
తల్లి లాలనకు దూరామా..." అంటూ.
అనిత తండ్రి ,నక్కా వెంకట రత్నం ,ఒక తాపీ మేస్త్రి. తల్లి, నాగమణి ఒక దినసరి కూలీ. ముగ్గురూ ఆడపిల్లలు. "మరి చదివిస్తారా ?
"
"ఆయ్ .. ఆళ్ళు సదుకుంటే సదివించేడవేనండీ.."అని అన్నారాయన.
ఆ పిల్లలకు శుభాన్ని కోరుకొంటూ..పరిచయం చేస్తున్నా... ఆ ప్రతిభ
పది కాలాలు పదిలం పదిలం అనుకొంటూ.
వినబోతూ రుచెందుకూ.. ?
ఆ మాధుర్యాన్ని మీరే ఆస్వాదించండి. ఆ చిన్నారులిద్దరినీ ఆదరంతో అభిమానంతో
తలుచుకోవడం.. మరవకండి !
https://www.youtube.com/watch?v=DdKrakNam84&feature=youtu.be
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.