|
స్రవంత్ సాహితిల ప్రమాణాల పెళ్ళి. |
చిన్నప్పుడు తరుచూ వినేవాళ్ళం .చూశాం కూడా.
దండల పెళ్ళి.
నాన్న గారు, వారి మిత్రబృందం ఉత్తేజంగా పెద్దరికం వహించి నిర్వహించిన , త్రిపురనేని వివాహవిధి , ఆ తరువాత మీటింగు పెళ్ళి (కమ్యూనిస్టుల పెళ్ళి గా ప్రసిద్ధి)...
తొంభై ఏళ్ళ వెలమాటి సత్యనారాణయణ గారు తన అధ్యక్షతన జరిపించిన అభ్యుదయ వివాహాల వేడుకల గురిచి ఉత్సాహంగా చెపితే, పేరిలింగం గారు తమ అనుభవాలను ఉద్వేగంగా వివరిస్తే,జర్మన్ విద్యార్ధి స్టీఫెన్స్ ముచ్చటగా తెలుగులో పెళ్ళి ముచ్చట్లు చెప్పారు.
నిన్న ఎంతో సంతోషంగా జరిగిన స్రవంత్ సాహితిల ప్రమాణాల పెళ్ళి.
|
పసల భీమన్న గారు,వెలమాటి సత్యనారాణయణ గారు,పేరిలింగం గారు |
మరీ పొదుపుగా, రెండు వాక్యాల ప్రమాణం .. రెండు దండల సరదా!ఇద్దరు పెళ్ళి పెద్దలు! అధ్యక్షుల వారు సతిష్ చందర్ గారు నవ్వుల్లో పెళ్ళిజంటను ముంచేస్తే, పసల భీమన్న గారు రెండువాక్యాల్లో పెళ్ళినిచేసేసారు! ఇక, విందు,వినోదాలు, సాహిత్యం , ఇంద్రజాలం, జానపద నాట్యాలు,పాటలు..
పొద్దున పదిగంటలనుంచి రాత్రి పదింటి దాకా ... హాయిగా సాగిన పెళ్ళి వేడుకలు.
పనసపొట్టుకూర తింటూ వేసిన లొట్టలే పెళ్ళికి మంగళవాద్యాలంటే నమ్మండి !
అయితేనేం,గులబీ పూలరేకుల పరిమళం, స్రవంత్ సాహితిలను ముంచెత్తాయి..సతిష్ చందర్ గారి మాటలతో వెల్లువెత్తుతోన్న నవ్వులతో పోటీగా.
పెళ్ళిని ఇంత హాయిగా చేసుకోవచ్చు!
చూడండి పెళ్ళికూతురి నాన్నారిని ! పక పక నవ్వుతున్నారే ..వారే ! మన "గమనం" గారే.. మరొక వ్యాఖ్యానం దేనికి !
వధూవరుల అమ్మానాన్నలు ఇద్దరూ ఇదేపద్దతిలో అభ్యుదయవివాహాలు చేసుకోవడమే విశేషం. అని అందరూ అంటుంటే, అది కాదు, వారి సాదకబాధకలను స్వయంగా చూసి, మళ్ళీ అదే బాటను నడవాలని నిర్ణయించుకొన్న స్రవంత్ సాహితిలదే , నిశ్చయంగా గట్టి నిర్ణయం అని. ఎందుకంటే, వారువురి అమ్మానాన్నల వివాహాల సమయంలో , బోలెడంత ఉద్యమ వాతావరణం. ఈ రోజు పూర్తిగా అందుకు భిన్నం. ఏది ఏమైనా, సాహితీస్రవంత్ ల సాహచర్యం వేయిరేకుల వెన్నల పుష్పమయి వికసించాలని.. స్నేహాబాందవ్యాన్ని వెదజల్లాలనీ ... కోరుకొంటూ శుభాకాంక్షలు .
All rights @ writer.
Title,labels, postings and related copyright reserved.