Oct 30, 2014

బాలోత్సవ్ కథారచన

బాలోత్సవ్ @ కొత్తగూడెం కథారచన లో సీనియర్ లలో ద్వితీయబహుమతి పొందిన జి.శ్రీరాం , 9 వ తరగతి ,భద్రాచలం పబ్లిక్ స్కూల్ ,సారపాక ,ఖమ్మం జిల్లా ,రచన ఇక్కడ  చదవండి.



http://prabhavabooks.blogspot.in/2010/12/blog-post_19.html














All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 17, 2014

పిల్లలెక్కిన నావ ! :-(


పిల్లలెక్కిన నావ !  
తీరం చేరేనా  ఈ వేళ ?!? 

తలకొక దిక్కు.
తలా ఒక దిక్కు !

అక్కడి జీవితాలు ..

నడిసంద్రంలో 
ఓటి నావలు.

ఎక్కడివక్కడ 
 కుదుటపడాలనీ..
త్వరగా.


All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 7, 2014

కానీ, పళ్ళెంలోకి ... ?

ఇవ్వాళ సాయంత్రం. పిల్లలు గూళ్ళకు చేరుకొనే వేళ. 
ఇంకా బడిలోనే ఉన్నాం. రేపటి పాఠాల తయారిలో. 
శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి పలకరింపు. 
అశ్చ్యర్యంగా.
ఆవేదనతో.
" నిన్నటి ఉదయం రేగడి విత్తులు మళ్ళీ చదవడం మొదలు పెట్టాను. పూర్తయింది. నీతో మట్లాడాలనిపించింది. " అంటూ.. "తెనాలి దగ్గర మాకు తాతలనాటి పొలం ఉండేది. ఒక రైతు మా వద్ద కొనుక్కొన్నాడు.ఈ మధ్య ఆ దారిన వస్తూ , ఆ మట్టి మీద ఆప్యాయతతో.. ఆ రైతు క్షేమసమాచారాలు అడుగుదామని ఆగాం. ఆ పొలం సాగుచేస్తున్నట్లుగా లేదు. రైతన్న కష్టాలేమిటోనని పరామర్షించాం.
"ఎకరం పదిహెను నుంచి పాతిక లక్షలు చేస్తుందండి. సాగు చేస్తే,
పొలం బిగువుండదని బిల్డర్లు కొనరండి .. అందుకనే పంటేయకుండా బేరసారాలు చూత్తన్నామండి! " అన్నారట. 

సుబ్బరామయ్య గారు చాలా సేపు బాధ పడ్డారు.. 
"బహుళ అంతస్తుల భవనాలు వరుసలు వరుసలుగా వస్తాయమ్మా... కానీ, పళ్ళెంలోకి అన్నం ?" 
వారి గొంతులో తొణికిన ఆర్ద్రతకు నేనేమీ మాట్లాడలేక పోయాను.
" రేగడివిత్తుల ముందుమాటలో నీవు లేవనెత్తిన మౌలిక ప్రశ్నలకు ఇక సమాధానం దొరకదమ్మా.." 
అంటూ చాలా సేపు బాధ పడ్డారు. 
వారికి నేనేం బదులివ్వగలను ? 
మౌనంగా వారి ఆవేదనను పంచుకోవడం తప్ప ! ప్చ్!
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Oct 3, 2014

కన్నుల పండుగ


  జమ్మి చెట్టు గుబురులో       
                   చిట్ట చివరి కొమ్మపై
పాల పిట్ట వాలింది .
              గుట్టు గుట్టుగా.
పేరులోనే  పాలంట.
                     రెక్కల్లో వానవిల్లంట.
ఆకు తెరల మాటున                  
                        వన్నెచిన్నెల వెల్లువంట.
చూస్తేనే చాలంట.
                   కళ కళ కన్నుల పంట... !


 Palapitta , Indian Roller Bird. Telugu State bird in the former Andhra Pradesh. Telugus, inparticualr Telengana region , consider it as a good omen to sight Palapitta on Dasara day. They watch for it in  the Jammi tree (The Sami tree (botanical name Prosopis spicegera). And collect jammi leaves and share  with near and dear as “Gold.” 




All rights @ writer. Title,labels, postings and related copyright reserved.