కాలుష్యరహితంగా దీపావళి పండుగను
ఎలా గడపవచ్చునో మీకు ఏమైనా తెలుసా?
కొంత కొత్తగా ఆలోచించి చూడండి!
మొన్న ప్రభవలో ,
పిల్లలు ఎన్నెన్ని రకాల ఉపాయాలను చెప్పారో!
ఇక, శ్రీహిత్ చెప్పాడు.
వాళ్ళమ్మతో బాటు ఈ మధ్య వానలు పడ్డప్పుడు మొక్కలు నాటాడట.
నెల్లూరు బుజ్జి న్యూటన్ గారు వీరే ! |
కొన్ని నీళ్ళు పడగానే ,టప టప లాడిన కనకాంబరం విత్తనాలను.
అలా టప టప లాడడానికి గల జీవ రహస్యమేమిటో కనుక్కుని, దానిని అన్వయించి ,తాను కొత్తరకం టపాకాయలు తయారు చేస్తాడట. అప్పుడు మనం నిప్పుతో కాకుండా నీళ్ళతో టపా కాయలు "కాల్చుకోవచ్చ"ట!
నిప్పు పుట్టించే కాలుష్యమూ ఉండబోదు!
టపాకాయలదీపావళే దీపావళి !
ఇక, ప్రభవలో చేరిన పిన్నపెద్దలు అందరూ అతనికి జేజే లు చెప్పి, వెంటనే టెక్నో స్కూల్ బయటపడి , జీవసాంకేతిక నిపుణుడై ,ఆ కనకాంబరం టపాకాయలను వెంటనే కనుక్కోమని , ఆపై పేటేంట్ కూడా తీసేసుకోమనీ ,
మేమందరమూ ఆ టపాకాయలనే ప్రతి దీపావళికి టపటప లాడిస్తామని చెప్పేసాం!
అదుగోండి అలాంటి , అనేక విశేషాలతో, ప్రభవ లో పిల్లల పండుగ జరింది.
మరి మీరూ చూడండి.
*
మీకుమీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలతో ..
ప్రభవ
లోని
పిన్నాపెద్దా!
బాగున్నాయండీ పిల్లల కబుర్లు ! వాళ్ళకీ , వాళ్ళలో ఆ సృజనాత్మకత గుర్తించి ప్రోత్సహిస్తున్న మీ అందరికి నా అభినందలు అలాగే నీటి టపాకాయల ఉపాయం చెప్పిన శ్రీహిత్ తో పాటు మీఅందరికి దీపావళి శుభాకాంక్షలు .
ReplyDelete