Mar 13, 2015

అక్కినారికి.. జేజేలు.



" నేను చదవాల్సిన నవల రెండేళ్ళ లేటు !" అనిపించింది" కొల్లేటి జాడలు" ముగించగానే. 
పక్కనే పెట్టుకొన్నా . ఇవ్వాళరేపు అనుకొంటూ కాలం కరిగిపోయింది. 
నా వద్ద పుస్తకాలు ఉన్నాయన్నా , ఏమీ మాట్లాడకుండా.. పుస్తకం ఇచ్చేసి వెళ్ళారు.అనిల్ అట్లూరిగారు .
ఊరక ఇవ్వరు మహానుభావులు అనుకొని , యధాలాపంగా చవడం మొదలేట్టా.. ఇక కొల్లేరు ఉప్పెనలా ముంచెత్తెంది. 
వందల ఎకరాల్లో కొల్లేటి సేద్యం ! 
అసాధ్యం సుసాధ్యం చేయించినా ఆయ పరిస్థితులు..ఆ నాయకత్వం.. ఆ విజయాన్ని కొనసాగించలేని రైతు మనస్తత్వాలు...స్వభావస్వరూపాలు  ... నేనెరుగనివా ?
మరోమారు ఉక్కిరిబిక్కిరి చేశాయిగాని ! 

ఉలిక్కిపడేలా చేసాయి కూడా.


వాళ్ళ అమ్మను గురించి మాట్లాడడానికి వచ్చి వారి నాన్న గారిని చేతికప్పంగించి వెళ్ళారన్నమాట!:-)
అనిల్ అట్లూరి గారికి ధన్యవాదాలు.


కొల్లేటి జాడల్లో అదృశ్యమైన ఆ మానవస్పర్షతోనే
మరో మారు మనలను పలకరించిన... పరామర్షించిన ...ప్రమాదహెచ్చరిక భజాయించిన.. 
అక్కినారికి.. జేజేలు.





All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Mar 5, 2015

అసమానం !

అది సామాన్యమైన విషయం ఏమీ కాదు.
 పుస్తకాల విక్రయం! 
అందునా, అది అలనాడు. అవేమో తెలుగు పుస్తకాలు. అదేమో మద్రాసు నగరం  ! 
వారు చౌదరాణి గారు. పత్రికాకరస్పాండెంట్‌ .పుస్తకవిక్రేత.వంటరి అమ్మ.
అందుకే, అందరం కాసేపు వారి గురించి కాసేపు ముచ్చటించుకొందాం. గౌరవంగా.ప్రభవలో. 
సాయంకాలం అయిదు గంటలకు . ఆదివారం నాడు. మార్చి 8న. ఆ రోజటి ప్రత్యేకతేమిటో చెప్పక్కరలేదుగా?
వారి గురించి ముచ్చట్లాడబోయేది, వారి అబ్బాయి అనిల్ అట్లూరి గారు . 
మరి జ్ఞాపకంగా వస్తారుగా!


చౌదరాణి గురించి వివరంగా ఇక్కడ చదవచ్చు.
http://www.sakshi.com/news/family/chennai-central-telugu-their-chat-214902
***
   

All rights @ writer. Title,labels, postings and related copyright reserved.

Feb 15, 2015

వినబోతూ రుచెందుకూ.. ?

మట్టిలో మాణిక్యాలు దొరుకుతాయి అన్న  మాట నిజమని  మరొక సారి నిరూపించింది క్రియ బాలోత్సవ్ 2015
 నక్కా అనిత ఆరో తరగతి అమ్మాయి . పురకట్ల పల్లి  జిల్లా ప్రజా పరిషత్ ఓరియెంటల్ హై స్కూల్  లో చదువుతోంది. వాళ్ళ అక్క మౌనిక ఈ ఏడాదే బడి వదిలి, కాలేజీలో చేరింది. అక్క నేర్పిన  పాటను అనిత హృద్యంగా పాడి , అందరినీ కొల్లగొట్టేసింది.
 "బువ్వ పెట్టి బుజ్జగించే ఆ తల్లి లాలనకు దూరామా..." అంటూ.
అనిత తండ్రి ,నక్కా వెంకట రత్నం ,ఒక తాపీ మేస్త్రి. తల్లి, నాగమణి ఒక దినసరి కూలీ. ముగ్గురూ ఆడపిల్లలు. "మరి చదివిస్తారా ? "
"ఆయ్  .. ఆళ్ళు సదుకుంటే సదివించేడవేనండీ.."అని అన్నారాయన. 
ఆ  పిల్లలకు శుభాన్ని కోరుకొంటూ..పరిచయం చేస్తున్నా... ఆ ప్రతిభ పది కాలాలు పదిలం పదిలం అనుకొంటూ.


వినబోతూ రుచెందుకూ.. ?
ఆ మాధుర్యాన్ని మీరే ఆస్వాదించండి. ఆ చిన్నారులిద్దరినీ ఆదరంతో అభిమానంతో తలుచుకోవడం.. మరవకండి !

https://www.youtube.com/watch?v=DdKrakNam84&feature=youtu.be




All rights @ writer. Title,labels, postings and related copyright reserved.