Oct 17, 2014
Oct 7, 2014
కానీ, పళ్ళెంలోకి ... ?
ఇవ్వాళ సాయంత్రం. పిల్లలు గూళ్ళకు చేరుకొనే వేళ.
ఇంకా బడిలోనే ఉన్నాం. రేపటి పాఠాల తయారిలో.
ఇంకా బడిలోనే ఉన్నాం. రేపటి పాఠాల తయారిలో.
శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి పలకరింపు.
అశ్చ్యర్యంగా.
ఆవేదనతో.
" నిన్నటి ఉదయం రేగడి విత్తులు మళ్ళీ చదవడం మొదలు పెట్టాను. పూర్తయింది. నీతో మట్లాడాలనిపించింది. " అంటూ.. "తెనాలి దగ్గర మాకు తాతలనాటి పొలం ఉండేది. ఒక రైతు మా వద్ద కొనుక్కొన్నాడు.ఈ మధ్య ఆ దారిన వస్తూ , ఆ మట్టి మీద ఆప్యాయతతో.. ఆ రైతు క్షేమసమాచారాలు అడుగుదామని ఆగాం. ఆ పొలం సాగుచేస్తున్నట్లుగా లేదు. రైతన్న కష్టాలేమిటోనని పరామర్షించాం.
"ఎకరం పదిహెను నుంచి పాతిక లక్షలు చేస్తుందండి. సాగు చేస్తే, పొలం బిగువుండదని బిల్డర్లు కొనరండి .. అందుకనే పంటేయకుండా బేరసారాలు చూత్తన్నామండి! " అన్నారట.

సుబ్బరామయ్య గారు చాలా సేపు బాధ పడ్డారు..
"బహుళ అంతస్తుల భవనాలు వరుసలు వరుసలుగా వస్తాయమ్మా... కానీ, పళ్ళెంలోకి అన్నం ?"
వారి గొంతులో తొణికిన ఆర్ద్రతకు నేనేమీ మాట్లాడలేక పోయాను.
" రేగడివిత్తుల ముందుమాటలో నీవు లేవనెత్తిన మౌలిక ప్రశ్నలకు ఇక సమాధానం దొరకదమ్మా.."
అంటూ చాలా సేపు బాధ పడ్డారు.
వారికి నేనేం బదులివ్వగలను ?
మౌనంగా వారి ఆవేదనను పంచుకోవడం తప్ప ! ప్చ్!
***
All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
Oct 3, 2014
కన్నుల పండుగ
జమ్మి చెట్టు గుబురులో
చిట్ట చివరి కొమ్మపై
పాల పిట్ట వాలింది .
గుట్టు గుట్టుగా.
పేరులోనే పాలంట.
రెక్కల్లో వానవిల్లంట.
ఆకు తెరల మాటున
వన్నెచిన్నెల
వెల్లువంట.
చూస్తేనే చాలంట.
కళ కళ కన్నుల పంట... !
Palapitta , Indian Roller Bird. Telugu State bird
in the former Andhra Pradesh. Telugus, inparticualr Telengana region , consider
it as a good omen to sight Palapitta on Dasara day. They watch for it in the Jammi tree (The Sami tree (botanical name Prosopis spicegera). And collect jammi leaves and share with near and dear as “Gold.” All rights @ writer. Title,labels, postings and related copyright reserved.
Subscribe to:
Posts (Atom)